అక్కడ ఉంది రాజమౌళి.. కాబట్టి నమ్మాల్సిందే..!

shami
రాజమౌళి సినిమాల్లో హీరోలు చాలా పవర్ ఫుల్ గా ఉంటారు. హీరోయిజం చూపించాలి అంటే రాజమౌళి తర్వాతే అనేలా ఉంటాయి ఆయన సినిమాలు. ఓ విధంగా ఆయన సినిమాలు బాక్సాఫీస్ దగ్గర ఆ రేంజ్ హిట్ అవడానికి ఆయన హీరోలను చూపించే విధానమే అని చెప్పొచ్చు. ఇక ఇదిలాఉంటే తన సినిమాలో ఒక్క హీరో ఉంటేనే ఓ రేంజ్ లో చూపించే రాజమౌళి ఇద్దరు హీరోలను అది సూపర్ స్టార్స్ ను ఎలా హ్యాండిల్ చేసి ఉంటాడు. rrr కోసం అటు ఎన్.టి.ఆర్, రాం చరణ్ ఇద్దరిని ఎంపిక చేసిన తర్వాత వీళ్లిద్దరికి సమానమమైన రోల్స్ ఎలా ఇవ్వాలని ఆలోచించి ఉంటాడు జక్కన్న.
ఎన్.టి.ఆర్, చరణ్ ఈ మెగా నందమూరి కాంబో ఫిక్స్ చేయడానికి చాలా గట్స్ ఉండాలి. హీరోల అభిమానుల మధ్య ఉన్న వైరం తెలిసిందే. అయితే ఇద్దరి కాంబో ఎనౌన్స్ చేసినప్పటి నుండి తమ హీరోని ఎక్కడ తక్కువ చేసి చూపిస్తారో అన్న ఫీలింగ్ ఉంది. కాని rrr టీజర్, ట్రైలర్ చూశాక ఇది కదా రాజమౌళి అంటే అనిపించింది. ఫ్యాన్స్ ఎక్కడ వేలెత్తి చూపించే అవకాశం లేకుండా రాజమౌళి తన టాలెంట్ చూపించాడు. ఎంచుకున్న కథను తీసుకున్న స్టార్స్ కు పర్ఫెక్ట్ గా మ్యాచ్ చేసి ఆర్.ఆర్.ఆర్ అనే అద్భుతాన్ని తెరకెక్కించాడు.  
ట్రైలర్ చూశాక కానీ మెగా, నందమూరి ఫ్యాన్స్ లో డౌట్లన్ని క్లియర్ అయ్యాయని చెప్పొచ్చు. రాజమౌళి ఏం చేసినా పర్ఫెక్ట్ గా ఉంటుంది. ఇద్దరు హీరోలను తీసుకుని అందులో ఒకరిని ఎక్కువ ఒకరిని తక్కువ చేసి చూపించే ఛాన్సే లేదు. అందుకే తారక్, చరణ్ ఇద్దరికి బలమైన పాత్రలు ఇచ్చాడు. అఫ్కోర్స్ ఆ పాత్రల్లో వారు నట విశ్వరూపం చూపించారని అనిపిస్తుంది. ట్రైలర్ తో సినిమాపై అంచనాలు పెంచేసిన జక్కన్న rrr మెగా నందమూరి అభిమానులకు నెవర్ బిఫోర్ గిఫ్ట్ ఇచ్చేందుకు రెడీ అయ్యాడు. మరి ఈ సినిమా రాజమౌళిని మరో 10 మెట్లు ఎక్కేలా చేస్తుందా లేదా అన్నది జనవరి 7న తెలుస్తుంది.
 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: