వార్నీ.. రామ్ చరణ్ ఆ రెండు సినిమాల స్టోరీ తెలియకుండానే చేశాడట..!!

Anilkumar
సినీ ఇండస్ట్రీలో ఎంత పెద్ద అగ్ర దర్శకుడైనా హీరోకి కథను కచ్చితంగా వినిపించాల్సిందే. ఆ కథ హీరోకి నచ్చితేనే ఆ సినిమా పట్టాలెక్కుతోంది. లేదా ఆ కథ హీరోకి నచ్చకపోతే మరొక హీరోతో తెరకెక్కుతుంది. ఇది సినిమా పరిశ్రమలో జరిగే సర్వసాధారణమైన విషయం. కానీ ఈ విషయంలో మన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మాత్రం కాస్త భిన్నంగా ఉన్నాడు. సినీ ఇండస్ట్రీలో ఓ ఇద్దరు అగ్ర దర్శకుల కథ వినకుండానే రామ్ చరణ్ సినిమా ఓకే చేస్తారట. ఇంతకీ ఆ ఇద్దరు దర్శకులు ఎవరు? వాటి పూర్తి వివరాల్లోకి వెళితే.. రామ్ చరణ్ కెరీర్లోనే భారీ విజయాన్ని అందుకున్న మొదటి చిత్రం 'మగధీర'. ఈ సినిమాకి ఎస్.ఎస్ రాజమౌళి దర్శకత్వం వహించారు.


 ఇప్పుడు మరోసారి రామ్ చరణ్ తో ఆర్ఆర్ఆర్ అనే పాన్ ఇండియా సినిమా తెరకెక్కించాడు రాజమౌళి. మరోవైపు రామ్ చరణ్ కి 'రంగస్థలం' లాంటి మరపురాని కావ్యాన్ని అందించిన క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్.ఈ ఇద్దరు దర్శకుల కథలు వినకుండానే చరణ్ సినిమాలు ఓకే చేశాడట. ఈ విషయాన్ని స్వయంగా రామ్ చరణ్ చెప్పటం విశేషం. తాజాగా ఒక ఇంటర్వ్యూలో భాగంగా 'ఆర్ ఆర్ ఆర్' కథ వినకుండానే సినిమాని ఓకే చేశారట గా అని రామ్ చరణ్ ని ప్రశ్నించగా..' అవును అది నిజమే అని చరణ్ చెప్పాడు. తాను కథలు వినకుండా సినిమాలు చేసే దర్శకులు ఇద్దరే ఇద్దరు అని అందులో ఒకరు రాజమౌళి అయితే మరొకరు సుకుమార్ గారు అని' ఆ ఇంటర్వ్యూ లో రామ్ చరణ్ స్వయంగా తెలియజేశాడు.


దీంతో ప్రస్తుతం చరణ్ చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్ గా మారాయి. ఇక ప్రస్తుతం రామ్ చరణ్ కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'ఆచార్య' సినిమాలో ఓ కీలక పాత్రలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఇక ఈ సినిమాతో పాటు తమిళ అగ్ర దర్శకుడు శంకర్ తో భారీ పాన్ ఇండియా సినిమా చేస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా రెండు షెడ్యూల్స్ పూర్తి చేసుకుంది. టాలీవుడ్ అగ్ర నిర్మాత దిల్ రాజు భారీ బడ్జెట్ తో ఈ సినిమాను నిర్మిస్తున్నారు. మరో వైపు చరణ్ తాజాగా నటించిన 'ఆర్ఆర్ఆర్' వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 7న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది...!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: