తెలుగు సినిమాలలో మంచి క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా తన కెరీర్ మొదలుపెట్టి ఇప్పుడు మంచి టాలెంటెడ్ హీరోగా ఎదిగాడు శ్రీవిష్ణు.ఇక ఇప్పటి దాకా కూడా తన కెరీర్ లో ఎటువంటి వివాదాల జోలికి కూడా పోలేదు శ్రీవిష్ణు.ఇక సైలెంట్ గా సినిమాల్లోనే నటిస్తూ.. వాటిని విడుదల చేసుకుంటూ ఉంటాడు. కానీ ఇప్పుడో
సినిమా కారణంగా శ్రీవిష్ణుని
నెటిజన్స్ చాలా దారుణంగా ట్రోల్ చేస్తున్నారు.శ్రీ విష్ణు నటించిన
సినిమా 'అర్జున ఫాల్గుణ' ట్రైలర్ ను ఈమధ్య విడుదల చెయ్యడం జరిగింది.ఇక ఇందులో గ్రామవాలంటీర్ ప్రస్తావన ఉంది.
హీరోయిన్ ను ఏ ఉద్యోగం వచ్చిందని అడుగుతాడు
హీరో స్నేహితుడు. దానికి ఆమె 'గ్రామ వాలంటీర్' అని చాలా గర్వంగా చెబుతుంది. ఇక ఆ మాట విన్న శ్రీవిష్ణు.. 'ఇంటింటికీ వెళ్లి కోటా సరుకులిస్తారు అదేనా..?' అని చాలా వెటకారంగా అడుగుతాడు. ఈ డైలాగే ఇప్పుడు అతడిని చాలా ఇబ్బందుల్లోకి నెట్టేసిందనే చెప్పాలి.ఇక గ్రామవాలంటీర్ అంటే అంత చీప్ గా కనిపిస్తున్నారా..ఏంటి ? అంటూ శ్రీవిష్ణుని ఓ రేంజ్ లో ఆడేసుకుంటున్నారు నెటిజన్స్.
ఇక
కరోనా మహమ్మారి సమయంలో గ్రామ వాలంటీర్లు చేసిన సేవలను శ్రీవిష్ణుకి గుర్తుచేస్తున్నారు
నెటిజన్స్ . కొంతమంది రియల్ లైఫ్ లో జరిగే ఉదాహరణలను షేర్ చేస్తుంటే..ఇక మరికొందరేమో పేపర్ కటింగ్స్ ను పోస్ట్ చేస్తూ శ్రీవిష్ణుని తెగ ట్యాగ్ చేస్తున్నారు.ఇక దీంతో శ్రీవిష్ణు పరిస్థితి ఇరకాటంలో పడినట్లయింది. ఇక ట్రైలర్ లో ఆ విజువల్స్ కాస్త వివాదాస్పదంగా అనిపించినప్పటికీ.. ఆ సినిమాలో గ్రామవాలంటీర్
ఎపిసోడ్ అంతా పాజిటివ్ గానే ఉంటుందని.. దాన్ని మంచి ఉద్యోగంగానే చెప్పామని అంటున్నారు
మూవీ మేకర్లు.ఏది ఏమైన
శ్రీ విష్ణు తన నోటి దుల తగ్గించుకుంటే మంచిదని
నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఇక ఈ వివాదం ఇక్కడితో ముగుస్తుందో లేదో చూడాలి..ఇక వాలంటీర్లు అయితే
శ్రీ విష్ణు నోటి దూలపై తెగ మండిపడుతున్నారు.పాపం ఈ విధంగా బుక్కయ్యాడు
శ్రీ విష్ణు.