బిగ్ బాస్ శ్రీ రామ్ కి బంపర్ ఆఫర్.. ఫాన్స్ ఫుల్ హ్యాపీ?

praveen
సాధారణంగా అప్పటి వరకూ ఎవరికీ తెలియని పరిస్థితుల్లో ఉన్న వారు ఒక్కసారి కొనసాగుతున్న బిగ్ బాస్ కార్యక్రమంలో కంటెస్టెంట్ గా అవకాశం దక్కించుకొని హౌస్ లోకి అడుగుపెట్టారు అంటే వారి క్రేజ్ ఎంతలా పెరిగి పోతుందో  ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇప్పటివరకు బిగ్బాస్  కార్యక్రమం ద్వారా ఎంతోమంది ఫేమస్ అయిన వాళ్ళు ఉన్నారు. ఇక బిగ్ బాస్ హౌస్ లోకి కంటెస్టెంట్ గా ఎంట్రీ ఇచ్చి అభిమానుల్ని సంపాదించుకోవడమే కాదు బయటికి వచ్చిన తర్వాత వరుస ఆఫర్లు అందుకున్న వారు కూడా చాలా మందే ఉన్నారు. ఈ క్రమంలోనే ఇటీవల తెలుగు ప్రేక్షకుల అందరికీ దగ్గర అయ్యేందుకు వచ్చాను అంటూ చెప్పి తన ఆటతో ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నాడు సింగర్ శ్రీరామచంద్ర.


 ఒకానొక సమయంలో ఇక ఇతనే బిగ్ బాస్ విన్నర్ గా నిలుస్తాడు అని అందరూ అనుకున్నారు. కానీ అనూహ్యంగా సన్నీ విజేతగా నిలవడంతో మూడవ స్థానాన్ని దక్కించుకున్నాడు.. ఇక శ్రీరామ్ హౌస్ లో ఉన్నన్ని రోజులు తనదైన శైలిలో ఆట తీరుతో ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నాడు. అయితే బిగ్ బాస్ హౌస్ నుండి బయటకు వచ్చిన తర్వాత ఇటీవలే సింగర్ శ్రీరామ్ ఒక మంచి ఆఫర్ అందుకున్నాడు అని తెలుస్తోంది. ప్రస్తుతం తెలుగు ఓ టి టి ప్లాట్ ఫామ్  ఆహలో ప్రారంభం కాబోతున్న ఇండియన్ ఐడిల్ కార్యక్రమంలో హోస్ట్ గా  శ్రీరామచంద్రని ఎంపిక చేసినట్లు తెలుస్తోంది.


 ఇక ఈ విషయాన్ని అటు ఆహా మేకర్స్ అధికారికంగా కూడా ప్రకటించడం గమనార్హం.. అయితే ఎంతో అద్భుతంగా పాటలు పాడే శ్రీ రామచంద్ర 13 లో ఇండియన్ ఐడిల్ విన్నర్ గా నిలిచాడు అన్న విషయం తెలిసిందే. ఇక తెలుగులో కూడా ఎన్నో అద్భుతమైన పాటలు తెలుగు ప్రేక్షకులు అందరిని కూడా అలరించాడు. తన గాత్రంతో ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నాడు. ఇక ఇటీవల బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్ళిన తర్వాత తెలుగు ప్రేక్షకులందరికీ సుపరిచితుడిగా మారిపోయాడు శ్రీ రామచంద్ర. కాగా ఆహా ఓటీటి లో ప్రసారం కాబోతున్న ఇండియన్ ఐడల్ కార్యక్రమం మరికొన్ని రోజుల్లోప్రారంభం కాబోతోంది. ప్రస్తుతం సెలక్షన్స్ జరుగుతున్నట్లు తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: