సన్నికి షాక్ ఇచ్చిన మంత్రి.. ఎందుకంటే?
తాజాగా మరొక మంత్రి ఈ విషయం పై స్పందించారు.. వీడియో పై ఘాటు విమర్శలు చేశారు. అది కాస్త నెట్టింట వైరల్ అవుతుంది.హిందువుల మనోభావాలు దెబ్బతీసేలా ఓ వీడియో తీసిన బాలీవుడ్ యాక్టర్ సన్నీ లియోన్ పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అంతేకాదు ఈ వీడియో ను మూడు రోజులు సోషల్ మాధ్యమాల నుంచి తొలగించాలని విమర్శలు వస్తున్నాయి.
మధ్యప్రదేశ్ హోంమంత్రి నరోత్తమ్ మిశ్రా కూడా తాజాగా స్పందించారు. షరీబ్, తీషి పాడిన ‘మధుబన్ మే రాధిక నాచే’ పాట హిందీలో విడుదలైంది. ఈ సాంగ్‌లో బాలీవుడ్ నటి సన్నీ లియోన్ సందడి చేసింది. ఈనెల 22 న ఈ సాంగ్‌ను రిలీజ్ చేశారు. అయితే ఈ పాటపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన కొందరు పూజారులు కూడా ఈ పాట పై నిప్పులు చెరుగుతున్నారు. మనోభావాలను దెబ్బతీసేలా ఉంటున్నారంటూ పేర్కొన్నారు. ఈ వీడియో కూడా అలాంటిదేనని, సన్నీ లియోన్‌తోపాటు పాటపాడిన వారు కూడా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ విషయం పై స్పందించిన మ్యూజిక్ కంపెనీ పదాలను మారుస్తారని విజ్ఞప్తి చేశారు.