సన్నీలియోన్ లేటెస్ట్ ఆల్బమ్ పెద్ద దుమారమే రేపుతోన్న సంగతి తెలిసిందే. మధుబన్ మే నాచే రాధిక వీడియోసాంగ్ పై వివాదం రాజుకుంటోంది అన్న సంగతి మనందరికీ విధితమే. ఈ పాట పై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు హిందూ సంఘాల నాయకులు.. అశ్లీల నృత్యాలతో కృష్ణుడి ప్రియురాలు రాధను అవమానించారంటూ మండిపడుతున్నారు. తక్షణమే పాటను బ్యాన్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ పాటలో సన్నీలియోన్ మరోసారి తన బోల్డ్ స్టైల్‌ని చూపించింది. షరీబ్, తోషి స్వరపరచగా, కనికాకపూర్ పాడిన పాటను సన్నీ లియోన్ తన సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేసింది. ఈ పాట హిందువుల మనోభావాలను దెబ్బతీసే విధంగా ఉందని నెటిజన్లు ట్రోల్ చేయడం ప్రారంభించారు.
సన్నీలియోన్ క్షమాపణలు చెప్పాలని కొందరు డిమాండ్ చేస్తుండగా మరికొంతమంది ఈ పాటను బ్యాన్ చేయాలని వాదిస్తున్నారు.రాధ నర్తకి కాదు, భక్తురాలు. మధుబన్ పవిత్ర ప్రదేశం. రాధ మధుబన్‌లో ఇలా డ్యాన్స్ చేయలేదు. ఇది సిగ్గుపడే సాహిత్యం అని హిందూసంఘాలు మండిపడుతున్నాయి.అఖిల భారతీయ తీర్థ పురోహిత్ మహాసభ జాతీయ అ ధ్యక్షు డు మ హేష్ పాఠ క్ సైతం తీవ్రంగా స్పందిం చారు. అసభ్యకరమైన రీతిలో డ్యాన్స్ చేయడం ద్వారా సన్నీ లియోన్ బ్రిజ్ భూమి అవ మా నిం చారన్నారు.
సన్నీలియోన్ వీడియో ఆల్బమ్ పై ప్రభుత్వం చర్యలు తీసుకోకుంటే కోర్టును ఆశ్రయిస్తామన్నారు సంత్ నావల్ గిరి మహారాజ్. మూడురోజుల్లోగా ఈపాటకు సంబంధించి క్షమాపణలు చెప్పడంతో పాటు ఆల్బమ్‌ను నిలిపివేయాలని మధ్యప్రదేశ్ మంత్రి నరోత్తమ్ మిశ్రా హెచ్చరించారు. లేదంటే చర్యలు తీసుకుంటామన్నారు. కాగా సన్నీలియోన్ నటించిన ఈ వీడియో మ్యూజిక్ ఆల్బమ్ ను బుధవారం సరేగమ మ్యూజిక్ విడుదల చేసింది. ఇందులో మధుబన్ పాటపైనే ప్రధానంగా వివాదం నెలకొంది. వాస్తవానికి ఈ పాటను తొలిసారిగా 1960లో కోహినూర్ చిత్రంలో మహమ్మద్ రఫీ ఆలపించారు.