అనుకున్న డేట్ కే RRR.. ఈసారి ఫిక్స్ అంతే..!
ఓ పక్క సినిమా రిలీజ్ ప్రమోషన్స్ పీక్స్ లో చేస్తూ ఈసారి డేట్ మిస్ అవదని ఆర్.ఆర్.ఆర్ టీం చెబుతుంది. పరిస్థితులు ఎలా ఉన్నా సరే అనుకున్న డేట్ కే ఆర్.ఆర్.ఆర్ రిలీజ్ ఫిక్స్ అని చెబుతున్నారు. ఏపీలో కూ కొన్నిచోట్ల థియేటర్లు మూతపడ్డాయి. అక్కడ టికెట్ల రేట్ల వ్యవహారం కూడా ఇంకా ఫైనల్ అవలేదు. ఓ పక్క ప్రభుత్వం చెప్పిన టికెట్లతో థియేటర్లు నడపడం కష్టమని అక్కడ వారు భావిస్తున్నారు.
సౌత్ లో కూడా కొన్నిచోట్ల థియేటర్లలో 50 శాతం ఆక్యుపెన్సీ ప్రవేశ పెట్టే ఆలోచనలో ఉన్నారు. అయితే పూర్తిగా లాక్ డౌన్ అయ్యే పరిస్థితి ఉంటే తప్ప ఆర్.ఆర్.ఆర్ రిలీజ్ అయ్యితీరుతుందని అంటున్నారు. 50 పర్సెంట్ ఆక్యుపెన్సీ ఉన్న చోట్ల ఎక్కువ థియేటర్లలో రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు. మరి చివరి నిమిషం వరకు ఏం జరుగుతుందో చూడాలి. ప్రస్తుతానికి అయితే జనవరి 7న సినిమాని ఎట్టి పరిస్థితుల్లో రిలీజ్ చేయాలని ఫిక్స్ అయ్యారు మేకర్స్. యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్, మెగా పవర్ స్టార్ రాం చరణ్ ఇద్దరు నట విశ్వరూపం చూపించిన ఈ సినిమాలో అజయ్ దేవగన్, అలియా భట్, ఒలివియా మోరిస్ కూడా నటించారు. రాజమౌళి సినిమా అంటే కీరవాణి మ్యూజిక్ అదిరిపోవాల్సిందే. ఈ సినినాకు కూడా అదే మ్యాజిక్ రిపీట్ చేస్తున్నారు.