మరో రికార్డు సృష్టించిన రౌడీ హీరో... ఎందులోనో తెలుసా?

VAMSI
టాలీవుడ్ లో అతి తక్కువ సమయంలో భారీ క్రేజ్ తెచ్చుకున్న అతి తక్కువ మంది హీరోలలో రౌడీ హీరో విజయ్ దేవరకొండ ఒకరు. అర్జున్ రెడ్డి సినిమాతో మొదలైన విజయ్ క్రేజ్ ఆ తర్వాత వచ్చిన సినిమాల ఫలితంతో సంబంధం లేకుండా పాన్ ఇండియా స్థాయికి వెళ్ళాడు. విజయ్ నటన, స్టైల్, డైలాగ్ డెలివరీ వంటి లక్షణాలకు ఎందరో ఇతని అభిమానులుగా మారి పోయారు. అయితే వీరు తమకు సంబంధించిన ఏ అప్డేట్ తమ అభిమానులతో పంచుకోవాలన్నా సోషల్ మీడియా లోని పలు ప్లాట్ ఫామ్స్ ను విరివిగా వాడుతుంటారు. వాటిలో ముఖ్యంగా ఇంస్టా గ్రామ్ లు ప్రధానంగా వినియోగిస్తుంటారు.

వీరు ఈ సోషల్ మీడియా లో ఏ మెసేజ్, ఫోటో లాంటివి పెట్టిన క్షణాలకే లక్షల్లో వ్యూస్, షేర్స్ మరియు కామెంట్స్ లు వస్తుంటాయి. అంతలా వీరి క్రేజ్ ఉంటుంది. అదే విధంగా విజయ్ కి ఉన్న అభిమానులు కూడా ఇంస్టా గ్రామ్ లో ఫాలో అవుతూ ఉంటారు. ఇప్పుడు తాజాగా విజయ్ దేవరకొండను ఇంస్టా లో ఫాలో అవుతున్న వారి సంఖ్య 14 మిలియన్ లకు పైగా చేరుకుంది. అయితే ఈ విషయాన్ని విజయ్ దేవరకొండ పెద్దగా పట్టించుకోక పోయినా తన డై హార్డ్ ఫ్యాన్స్ మాత్రం సోషల్ మీడియా ద్వారా ఈ విషయాన్ని షేర్ చేస్తూ హంగామా చేస్తున్నారు.

కాగా ప్రస్తుతం విజయ్ దేవరకొండ లైగర్ సినిమా షూటింగ్ ను పూర్తి చేసుకుని విడుదల చేయడానికి సరైన సమయం కోసం వెయిట్ చేస్తున్నారు. ఈ సినిమాలో అనన్య పాండే హీరోయిన్ గా చేస్తోంది. బాక్సింగ్ నేపథ్యంలో రానున్న ఈ సినిమాను పూరి జగన్నాధ్ డైరెక్ట్ చేయగా..ఛార్మి మరియు పూరి ఇద్దరూ కలిసి నిర్మించారు. త్వరలోనే పాన్ ఇండియా స్థాయిలో ఈ సినిమా విడుదల కానుంది.  

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: