ఈ ఏడాది తొలి సక్సెస్ లు అందుకున్న వారు వీరే!!
ఆయన తన తొలి విజయాన్ని అందుకోవడానికి నాలుగు సినిమాలు పట్టింది. ఆయన చేసిన నాలుగో సినిమా మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ ప్రేక్షకులకు విపరీతంగా నచ్చింది. బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుని ఇద్దరికీ మర్చిపోలేని సినిమాగా మిగిలిపోయింది అని చెప్పవచ్చు. ఆ తర్వాత ప్రగ్య జైస్వాల్ ఈ సంవత్సరం అఖండ సినిమాతో హిట్ అందుకుంది. ఆమె చాలా రోజుల తర్వాత ఈ సినిమాతో హిట్ అందుకోగా ఆమె కెరీర్ లో హిట్ అయిన ఒకే ఒక సినిమా కంచె.
వరలక్ష్మి శరత్ కుమార్ తెలుగు లో ఎంట్రీ ఇచ్చి చాలా సినిమాల్లో చేసినా కూడా ఆమెకు ఈ సంవత్సరం క్రాక్ సినిమా తొలి విజయాన్ని అందజేసింది. సంక్రాంతికి బ్లాక్ బస్టర్ గా నిలిచిన ఈ సినిమాలో ఆమె జయమ్మ పాత్రలో నటించి తన తన విలనిజంతో అందరినీ భయపెట్టింది. నేల టికెట్ సినిమా తో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన మాళవిక శర్మ ఆ తరువాత కొన్ని సినిమాలలో నటించిన కూడా ఏమాత్రం వర్కౌట్ కాలేదు. రామ్ హీరోగా నటించిన రెడ్ సినిమాతో చెప్పుకోదగ్గ సక్సెస్ను చూసింది. మేఘ ఆకాశ రాజరాజ చోర తో తొలి విజయం అందుకుంది. అంతకు ముందు ఆమె లై చల్ మోహన్ రంగా వంటి రెండు చిత్రాలతో ప్రేక్షకులను అలరించే ప్రయత్నం చేసింది.