చీరకట్టులో అదరగొడుతున్న సాయి పల్లవి..!

Pulgam Srinivas
డాన్సర్ గా కెరియర్ ను మొదలు పెట్టిన సాయి పల్లవి, వరుణ్ తేజ్ హీరోగా శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కిన ఫిదా సినిమాతో  తెలుగు సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చి తెలుగు ప్రేక్షకులను ఫిదా చేసింది, ఇలా మొదటి సినిమాలోనే తన అంద చందాలతో, నటనతో, డాన్స్ తో తెలుగు ప్రేక్షకుల మనసు దోచుకున్న ఈ ముద్దుగుమ్మ ఆ తర్వాత కూడా టాలీవుడ్ లో క్రేజీ సినిమా ఆఫర్ లను కొట్టేసింది. ఇలా మొదటి సినిమా తోనే టాలీవుడ్ లో ఫుల్ క్రేజ్ ను సంపాదించుకున్న సాయి పల్లవి ఈ సంవత్సరం కూడా నాగ చైతన్య హీరోగా శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కిన లవ్ స్టోరీ సినిమాతో బాక్సాఫీస్ దగ్గర మంచి విజయాన్ని అందుకుంది, అలాగే తాజాగా నాచురల్ స్టార్ నాని హీరోగా తెరకెక్కిన శ్యామ్ సింగరాయి సినిమాలో దేవదాసి పాత్రలో కనిపించి ఇటు ప్రేక్షకుల నుండి అటు విమర్శకుల నుంచి ప్రశంసలు పొందింది.

 అలాగే ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ నటించిన విరాట పర్వం సినిమా మీద కూడా జనాల్లో మంచి అంచనాలు కలిగి ఉన్నాయి, విరాట పర్వం సినిమా విడుదల తేదీ పై ఇంకా స్పష్టత రాలేదు, ఇలా వరుస సినిమాలతో ఫుల్ బిజీగా సమయాన్ని గడుపుతున్న ఈ ముద్దుగుమ్మ సోషల్ మీడియాలో కూడా అంతే యాక్టివ్ గా ఉంటూ తన అభిమానులతో అనేక విషయాలను పెంచుకుంటూ ఉంటుంది, తన షూటింగ్ అప్డేట్ లను, తన డైలీ ఆక్టివిటీస్ ను ఎప్పటికప్పుడు సోషల్ మీడియా ద్వారా తన అభిమానులతో పంచుకుంటూ ఉండే సాయి పల్లవి అప్పుడప్పుడు తన అందచందాలతో కూడిన ఫోటోలను కూడా సోషల్ మీడియాలో అప్లోడ్ చేస్తూ ఉంటుంది,  తాజాగా కూడా ఈ ముద్దుగుమ్మ కొన్ని ఫోటోలను అప్లోడ్ చేసింది, ఈ ఫోటోలలో సాయి పల్లవి సంప్రదాయబద్ధంగా చీర కట్టుకొని క్లాస్ లుక్ లో ఫోటోలకు స్టిల్స్ ఇచ్చింది, ప్రస్తుతం సాయి పల్లవి కి సంబంధించిన ఈ సాంప్రదాయబద్ధమైన ఫోటోలు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: