ఒమిక్రాన్ పై షాకింగ్ కామెంట్స్ చేసిన ఆర్జీవీ..!

Divya
ఇటీవల కాలంలో ఆర్జీవీ ఏం మాట్లాడినా సరే అది సంచలనంగా మారుతూనే సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న విషయం తెలిసిందే. ఈయన స్టార్ సెలబ్రిటీల నుంచి రాజకీయ నాయకుల వరకు ఎవరిని కూడా ఒకపట్టాన వదలకుండా తనదైన శైలిలో అందర్నీ మాటల తూటాలతో హింసిస్తూ ఉంటాడు అని అందరూ చెప్పుకుంటున్నారు. ఇకపోతే ఆర్జివి ఈ మధ్య ఎక్కువగా అడాల్ట్ సినిమాలకు బాగా అడిక్ట్ అయిపోయాడు అని చెప్పాలి. అందుకే ఈయన మోడల్గా పనిచేసే ఎంతో మంది అమ్మాయిలను తీసుకొచ్చి హీరోయిన్ లుగా మార్చడానికి..వారితో హాట్ ఫోటో షూట్ లను నిర్వహిస్తూ వారి అందాలను మొత్తం సినిమాలలో చూపిస్తూ ఉంటాడు.
మొన్నటికి మొన్న అరియానా, అషూ రెడ్డి లను బాగా పాపులర్ చేసిన ఆర్.జి.వి ఇప్పుడు రాజకీయ నాయకులను కూడా టార్గెట్ చేసిన విషయం తెలిసిందే. ఇకపోతే తాజాగా విస్తరిస్తున్న మరొక వేరియంట్
ఒమిక్రాన్ పై కొన్ని షాకింగ్ కామెంట్స్ చేశారు. నిన్నటికి నిన్న ఒమిక్రాన్ ను  అరికట్టడానికి రాత్రి మాత్రమే కర్ఫ్యూ విధిస్తే ఎలా సాధ్యం అంటూ తన అభిప్రాయాన్ని వెల్లడించిన రామ్ గోపాల్ వర్మ తాజాగా డెల్టా వేరియంట్  గురించి చేసిన వ్యాఖ్య ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ఇప్పుడు తాజాగా మీడియా ఫోకస్ చేయాల్సింది పట్టణంలోకి కొత్తగా వచ్చిన అమ్మాయి అదే ఒమిక్రాన్.. కానీ అతి భయంకరమైన నిజమైన ప్రమాదం ఏమిటంటే మాజీ అమ్మాయి అయినా డెల్టా వైరస్ మృత్యువుతో  ఆటాడింది. నిజానికి డెల్టా వైరస్ బారిన పడిన వ్యక్తుల విషయానికొస్తే ఒక్కరోజులోనే ముంబైలో దాదాపుగా 1000 కేసులు నమోదు చేయడం గమనార్హం . కాబట్టి ఈ సరికొత్త అమ్మాయి అయిన ఒమిక్రాన్ పై  మీడియా ఫోకస్ చేయాల్సి ఉంటుంది అంటూ రాంగోపాల్ వర్మ తెలపడంతో ప్రస్తుతం అది కాస్తా సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇక ప్రస్తుతం మీడియా కూడా ఈ కేసుల పై ఫోకస్ చేయడం గమనార్హం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: