టాలీవుడ్ యంగ్ స్టార్ హీరో నేచురల్ స్టార్ నానికి 'జెర్సీ' తర్వాత సరైన హిట్టు లేదు. ఇక ఆ సినిమా కూడా కొన్ని ఏరియాల్లో బ్రేక్ ఈవెన్ కాలేదు. కానీ ఈ మధ్య కాలంలో, అంటే 'శ్యామ్ సింగ రాయ్' సినిమాకు ముందు వరకు నానికి హిట్ అని చెప్పుకోడానికి అదొక్కటే సినిమా.ఆ తర్వాత వచ్చిన 'గ్యాంగ్ లీడర్' 'వి' 'టక్ జగదీష్' వంటి సినిమాలు ఎన్నో భారీ అంచనాల నడుమ విడుదలై నిరాశపరిచాయి. 'వి' 'టక్ జగదీష్' సినిమాల విషయంలో అయితే నాని చాలా విమర్శలనే ఎదుర్కొన్నాడు.ఇక ఖచ్చితంగా హిట్టు కొట్టాల్సిన టైములో 'శ్యామ్ సింగ రాయ్' సినిమా వచ్చింది. డిసెంబర్ 24 వ తేదీన విడుదలైన ఈ సినిమా మంచి టాక్ ను సంపాదించుకుని బాక్సాఫీస్ వద్ద బాగానే పెర్ఫార్మ్ చేస్తుంది. చెప్పాలంటే అనేక అడ్డంకుల నడుమ ఈ సినిమా రిలీజ్ అయ్యింది. ఏపిలో పరిస్థితులు కూడా ఏమీ బాలేదు. 'శ్యామ్ సింగ రాయ్' సినిమాకి రూ.55 కోట్ల వరకు బడ్జెట్ పెట్టాడు నిర్మాత.
నాని గత చిత్రాలు నిరాశపరచడం.. పైగా ఏపిలో థియేటర్ల పరిస్థితులు అంతగా సరిగ్గా లేకపోవడం అలాగే ఇవి చాలవన్నట్టు పలు సినిమా వేడుకల్లో నాని చేసిన కామెంట్స్ వివాదాస్పదం అవ్వడంతో అతని పై నెగిటివిటీ నేర్పడడం.. అబ్బో ఇలాంటి ప్రతికూల పరిస్థితుల మధ్య 'శ్యామ్ సింగ రాయ్' సినిమాకు పెద్ద రేంజ్లో అయితే బిజినెస్ జరగలేదు. డిసెంబర్ 24 వ తేదీకి ముందు రోజు వరకు ఈ సినిమా విడుదలవుతుందా? అనే అనుమానాలు కూడా కూడా వ్యక్తమయ్యాయి. అయితే నిర్మాత ధైర్యం చేసి సొంతంగా చేసుకున్నాడు. నాని కూడా తన వంతుగా ఈ సినిమాకు రూ.5 కోట్ల పారితోషికం వెనక్కి ఇచ్చేశాడట.ఇక అలాగే అతనికి ఆఫర్ చేసిన రూ.8 కోట్ల పారితోషికంతో రూ.5 కోట్లు వెనక్కి ఇచ్చేయగా అతనికి మిగిలింది రూ.3 కోట్లు మాత్రమే. ఇక తన సినిమా థియేటర్లలో విడుదలవ్వాలి అనేది నాని యొక్క బలమైన సంకల్పం.. అందుకోసమే అతను ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది. ఇక నిర్మాతల్ని ఆదుకోవడానికి నానిలా మిగిలిన హీరోలు ధైర్యం చేస్తారా? అంటే సందేహమే అని చెప్పాలి.