రాజమౌళి, రామ్ చరణ్, ఎన్టీఆర్ కాంబినేషన్ లో తెరకెక్కిన 'ఆర్ ఆర్ ఆర్' అనే పాన్ ఇండియా సినిమా వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా విడుదలకు ముస్తాబైన సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన టీజర్స్, సాంగ్స్ కి ఓ రేంజిలో రెస్పాన్స్ వచ్చింది. తారక్, చరణ్ ఫ్యాన్స్ మాత్రమే కాకుండా సినిమా లవర్స్ అందరూ ఈ సినిమా కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ఇక ఇటీవల విడుదల చేసిన థియేట్రికల్ ట్రైలర్ కి అనూహ్య స్పందన రావడంతో ఇప్పుడు ఎక్కడ చూసినా ఈ సినిమాకు సంబంధించిన చర్చనే జరుగుతోంది. జనవరి 7న విడుదల కాబోతున్న ఈ సినిమా ప్రమోషన్స్ జోరుగా సాగుతున్నాయి.
అయితే ఇదే సమయంలో ఈ సినిమా ఓ టి టి రిలీజ్ గురించి ఓ వార్త బయటికొచ్చింది. అదేమిటి అంటే.. ఈ సినిమాని ఓ టి టి లో పే పర్ వ్యూ అనే పద్ధతి ద్వారా విడుదల చేసే ఆలోచనలో ఉన్నారట నిర్మాతలు. ఎందుకంటే ఓటీటీ సంస్థ ఈ సినిమా రైట్స్ ని భారీ రేటుకి కొనుగోలు చేసింది. అందుకే ఇలా చేస్తున్నారని మీడియాలో ప్రచారం జరుగుతోంది. అయితే మరికొంతమంది మాత్రం మరోసారి కరోనా సమస్యతో ఈ సినిమా వాయిదా పడే అవకాశం ఉందని.. దానికి తోడు నార్త్ లో నైట్ కర్ఫ్యూ లతో ఇబ్బంది అవుతుందని, అందుకే ఓటీటీ లో రిలీజ్ చేస్తున్నారని అంటున్నారు. అయితే నిజానికి అది జరిగే పని కాదు.
సినిమా ఓటీటీ రిలీజ్ అది కూడా పే పర్ వ్యూ పద్ధతి అంటే అది థియేటర్ రిలీజ్ లేకపోతేనే సాధ్యమౌతుంది. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో త్రిబుల్ ఆర్ లాంటి భారీ బడ్జెట్ సినిమా డైరెక్టర్ ఓటిటి రిలీజ్ అనేది అస్సలు పెట్టుకోదు. మరోపక్క ఈ సినిమా విడుదలైన మూడు నెలల వరకు ఓ టి టి లో విడుదల కాదని మేకర్ స్పష్టం చేశారు. ఇక ఈ సినిమా అన్ని భాషల హక్కులను బాలీవుడ్ ప్రొడక్షన్ హౌస్ పెన్ స్టూడియోస్ దక్కించుకుంది. ఇక తెలుగు ఓటీటీ హక్కులను జీ5 మరియు హిందీ ఓటీటీ హక్కులను నెట్ ఫ్లిక్స్ సంస్థలు కొనుగోలు చేసిన విషయం తెలిసిందే. అయితే ఈ సినిమాను హిందీలో సమర్పిస్తున్న పెన్ స్టూడియోస్ అధినేత జయంతి లాల్ సైతం ఓటీటీ రిలీజ్ గురించి మాట్లాడుతూ.. ఈ సినిమా విడుదలైన 75 నుంచి 90 రోజుల తర్వాతే ఓటీటీ లో ప్రీమియర్ అవుతుందని స్పష్టం చేశాడు...!!