ఆత్మహత్య చేసుకోవాలనుకున్న చలపతిరావు.. ఆ సీక్రెట్స్ అన్నీ గుట్టురట్టు!

kalpana
తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎన్నో సినిమాలలో విలన్ పాత్రలో, కమెడియన్ పాత్రలలో ఎంతో అద్భుతంగా నటించి మంచి గుర్తింపు సంపాదించుకున్న నటుడు చలపతిరావు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. చలపతిరావు స్వయంగా డైరెక్టర్ రవిబాబు గారికి తండ్రి. ఇలా సినిమా ఇండస్ట్రీలో ఎన్టీఆర్ కాలం నుంచి నేటితరం హీరోల సినిమాలలో కూడా నటిస్తూ ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న చలపతి తెరపై కమెడియన్ గా అందరినీ నవ్విస్తూ.. విలన్ గా అందరినీ భయబ్రాంతులకు గురి చేస్తూ మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. అయితే తెరపై అందరి చేత నవ్వులు పూయించిన చలపతిరావు నిజ జీవితంలో ఎన్నో విషాద ఘటనలు ఉన్నాయి. ఒకానొక సమయంలో ఆత్మహత్య కూడా చేసుకోవాలని భావించినట్లు ఓ కార్యక్రమంలో భాగంగా అప్పటి విషయాలను బయటపెట్టారు.
తెలుగు సినిమా ఇండస్ట్రీలో హాస్య నటుడిగా విలన్ గా గుర్తింపు పొందిన చలపతిరావు అసలు పేరు తమ్మారెడ్డి చలపతిరావు. ఈయన సుమారు 600 చిత్రాలకు పైగా నటించి ఇండస్ట్రీలో తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపును పొందారు. అదేవిధంగా చలపతి రావు వ్యక్తిగత విషయానికి వస్తే.. ఆయన ఇందుమతి అనే అమ్మాయిని ప్రేమించి తన స్నేహితుల సహాయంతో ప్రేమ వివాహం చేసుకున్నారు.వివాహం తరువాత మద్రాసులోనే నివాసముంటున్న చలపతిరావు ముగ్గురు పిల్లలు జన్మించారు. అయితే అప్పట్లో మద్రాసులో నీళ్ళు అర్ధరాత్రి రావడంతో అర్ధరాత్రి లేచి నీళ్లు పట్టాల్సి ఉండేది. ఈ క్రమంలోనే ఒక రోజు రెండు గంటల సమయంలో నీళ్లు రావడంతో తన వెళ్లి పడతానని చెప్పినప్పుడు తన భార్య మీరు పడుకోండి నేను వెళ్లి నీళ్లు పడతానంటూ వెళ్లిన తను అగ్ని ప్రమాదానికి గురై నిన్నే..నిన్నే అని పిలుస్తూ ఉండడంతో అనుమానం వచ్చిన చలపతిరావు వెళ్లి చూసేసరికి తన భార్య వెనుక భాగం మొత్తం పూర్తిగా కాలిపోయింది.
 చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తీసుకెళ్లిన అతను ఆస్పత్రిలో మూడు రోజులపాటు చావు బ్రతుకుల మధ్య కొట్టుమిట్టాడుతూ ప్రాణాలు విడిచింది. అప్పటికి ఇంకా చలపతిరావు కేవలం 22 సంవత్సరాలు వయసు మాత్రమే.తన భార్య మరణం తర్వాత తన పిల్లల సంరక్షణ చూసుకుంటూ ఉన్న చలపతిరావుకు ఎంతో మంది రెండో పెళ్లి చేసుకోమని సలహా ఇచ్చారు. అయితే ఎవరి మాట పట్టించుకోని చలపతిరావు తన పిల్లలను పెంచి పెద్దచేశారు. ఇలా తన జీవితం హాయిగా సాగిపోతున్న నేపథ్యంలో అతని గురించి పలు వార్తా పత్రికలు మహిళలతో అక్రమ సంబంధాలు పెట్టుకున్నాడని మహిళల పట్ల, చలపతిరావు ఎంతో దారుణంగా ప్రవర్తిస్తాడని తప్పుడు వార్తలు రాస్తూ తనని ప్రచారం చేయడంతో ఎంతో మనస్తాపానికి గురైన చలపతిరావు ఆత్మహత్య చేసుకోవాలని భావించారనీ ఓ సందర్భంలో తెలియజేశాడు.
అయితే ఆ సమయంలో ఒక సూసైడ్ లెటర్ లో మీడియా ప్రపంచంలో ఎవరిని బ్రత కనివ్వదని రాసి చనిపోదామని భావించాను. అయితే పిల్లల కోసం తన నిర్ణయాన్ని విరమించుకున్నట్లు చెప్పారు. ప్రస్తుతం తన జీవితం ఎంతో సుఖంగా ఉందని అమ్మాయిలు ఇద్దరికీ పెళ్లిళ్లు చేసి విదేశాలలో సెటిల్ అయ్యారని కొడుకు రవిబాబు రచయితగా నటుడిగా దర్శకుడిగా ఇండస్ట్రీలో తనకంటూ ఒక గుర్తింపును సంపాదించుకున్న సంగతి మనకు తెలిసిందే. ప్రస్తుతం చలపతిరావు తన కొడుకు రవి బాబు దగ్గరే ఉంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: