కమెడియన్ సునీల్ ఒక సినిమాకు ఎంత పారితోషికం తీసుకుంటాడో తెలుసా?

kalpana
కమెడియన్ సునీల్ అల్లరి నరేష్ హీరోగా చేస్తున్న సిల్లీ ఫెలౌస్ సినిమాలో ఫుల్ లెన్త్ కమెడియన్ గా సైడ్ క్యారెక్టర్ చేస్తున్నాడు. అలాగే త్రివిక్రమ్,ఎన్టీఆర్ కాంబినేషన్ లో వస్తున్న అరవింద సమేత సినిమాలో కూడా కమెడియన్ గా సునీల్ కనిపించనున్నాడు. ఇప్పటివరకు హీరోగా చేసిన సునీల్ కమెడియన్ గా నటిస్తున్న ఈ సినిమాలకు ఎంత పారితోషికం తీసుకుంటున్నాడో అనే విషయం మీద జోరుగా చర్చ సాగుతుంది. హీరోగా చేసినప్పుడు సునీల్ సినిమాని బట్టి పారితోషికం తీసుకునేవాడు. అయితే అరవింద సమేత సినిమాలో సునీల్ కళ్ళు చెదిరే పారితోషికం తీసుకుంటున్నాడు. సునీల్ మొదట్లో కమెడియన్ గా తన కెరీర్ ని మొదలు పెట్టి హీరోగా మారాడు.
హీరోగా చేసిన కొన్ని సినిమాలు హిట్ అయినా ఈ మధ్య కాలంలో సినిమాలు ఏమి హిట్ కాకపోవటంతో, కాస్త ఆలోచనలో పడి మరల కమెడియన్ గా మారాడు. అరవింద సమేత సినిమాలో సునీల్ కోసం త్రివిక్రమ్ ఫుల్ లెన్త్ క్యారెక్టర్ ని సృష్టించాడట. సునీల్, త్రివిక్రమ్ స్నేహితులు. దాంతో స్నేహితుడి కోసం ఫుల్ లెన్త్ పాత్రను రాసాడట త్రివిక్రమ్.
హీరో కనిపించినంత సేపు సునీల్ కూడా సినిమాలో కనిస్తాడట. కమెడియన్ నుండి హీరోగా…హీరో నుండి కమెడియన్ గా మారిన తర్వాత కూడా సునీల్ క్రేజ్ ఏ మాత్రం తగ్గలేదు. ఆతర్వాత అలా వైకుంఠపురములో, ఇప్పుడు పుష్ప సినిమాల్లో నటించి మంచి మార్కులు కొట్టేసాడు సునీల్. ఇక సునీల్ ఒక సినిమాకు కోట్లల్లో పారితోషికం తీసుకుంటున్నాడని టాక్. ఏది ఏమైనా ఇండస్ట్రీలో ఒక వ్యక్తి కమెడియన్ నుంచి హీరోగా.. ఆతర్వాత హీరో నుంచి కమెడియన్ గా చెయ్యడం అంటే మాములు విషయం కాదు.. ఏం అంటారు?
కాగా జెడి చక్రవర్తి హీరోగా నటించిన పాపే నా ప్రాణం సినిమాలో వెయిటర్ గా ఒక చిన్న పాత్రలో టాలీవుడ్ లో అడుగు అడుగు పెట్టాడు. అనంతరం నువ్వేకావాలి సినిమాతో ఒక్కసారిగా తెలుగు సినిమాకు గోదావరి యాసతో మాట్లాడే హాస్య నటుడిగా బెస్ట్ ఆప్షన్ అయ్యాడు. నువ్వు నేను, నువ్వు నాకు నచ్చావ్, నువ్వే నువ్వే, సొంతం, మనసంతా నువ్వే, అతడు, ఆంధ్రుడు వంటి అనేక సినిమాల్లో హాస్యనటుడిగా అలరిస్తూనే అందాల రాముడు,  మర్యాదరామన్న వంటి అనేక సినిమాల్లో హీరోగా నటించాడు. సుమారు 200 సినిమాల్లో విభిన్న పాత్రల్లో నటించిన సునీల్ తాజాగా అల్లు అర్జున్ హీరోగా నటించిన పుష్ప లో విలన్ గానటించాడు..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: