మమ్ముట్టి భీష్మ పర్వంలో అనసూయ.. మరో రంగమ్మత్త లాంటి రోల్ పడ్డది..!
అలాంటి ఇలాంటి సినిమా కాదు ఏకంగా మళయాళ మెగాస్టార్ మమ్ముట్టి హీరోగా వస్తున్న సినిమాలో అనసూయ లక్కీ ఛాన్స్ పట్టేసింది. మమ్ముట్టి లీడ్ రోల్ లో అమల్ నీరద్ డైరక్షన్ లో వస్తున్న సినిమా భీష్మ పర్వం. ఈ సినిమాను అమల్ నీరద్ డైరెక్త్ చేయడమే కాదు నిర్మిస్తున్నారు కూడా. ఈ సినిమాలో తెలుగు యాంకర్ అనసూయ అలీస్ పాత్రలో నటిస్తుంది. సినిమాలో అనసూయ ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు చిత్రయూనిట్. మమ్ముట్టి భీష్మ పర్వం అనసూయ ఫస్ట్ లుక్ సందర్భంగా అమ్మడి కామెంట్స్ అలరిస్తున్నాయి.
కొన్ని పనులు ఆరంభించే ముందు.. అడుగు పెట్టిన వెంటనే మన మీద గట్టి ప్రభావం చూపిస్తాయి. అంతేకాదు మిగిలిన జీవితం అంతా కూడా ఎంతో గర్వంగా జీవించొచ్చు అనే ఫీలింగ్ ఉంటుంది. అలాంటిదే ఇది.. అలీస్ ను కలవండి అంటూ సినిమాలో తన పాత్రని పరిచయం చేస్తూ.. ఆ పాత్ర పొందినందుకు అనసూయ ఎలా ఫీల్ అవుతుంది అన్నది తన మాటల్లోనే అర్ధమవుతుంది. తెలుగులోనే కాదు మిగతా భాషల్లో కూడా అనసూయ తన మార్క్ చూపించాలని ఫిక్స్ అయ్యింది. మమ్ముట్టి నటించిన యాత్ర సినిమాలో అనసూయ ఒక చిన్న పాత్రలో నటించింది. బహుశా ఆ టైంలోనే అనసూయ మళయాల సినిమా ఆసక్తి చూపించడంతో మమ్ముట్టి ఈ ఆఫర్ ఇచ్చి ఉంటారని చెప్పుకుంటున్నారు.