ఈ స్టార్ హీరోల సినిమాను బహిష్కరించాల్సిందే.. ట్విట్టర్‌లో పెరిగిన కామెంట్స్.. ఎందుకో తెలుసా..?

N.ANJI

బాలీవుడ్ సూపర్ స్టార్స్ అక్షయ్ కుమార్, సారా అలీఖాన్.. సౌత్ ఇండియన్ సూపర్ స్టార్ ధనుష్ కలిసి నటించిన ‘అత్రంగి రే’ సినిమా ఇటీవల రిలీజ్ అయింది. డిస్నీ ప్లస్ వేదికగా హాట్‌స్టార్‌లో ఈ సినిమా విడుదల చేశారు. అయితే ఈ సినిమాకు ఒక వైపు పాజిటివ్ రెస్పాన్స్ వస్తుండగా.. మరోవైపు ఈ సినిమాపై నెగిటివ్ రెస్పాన్స్ వస్తోంది. దేశంలోని ఒక వర్గం ఈ సినిమాను బహిష్కరించేందుకు ట్విట్టర్ వేదికగా డిమాండ్ చేస్తోంది. లవ్ జిహాద్‌ను ఇండియా ప్రోత్సాహిస్తోందని ఆందోళన వ్యక్తం చేస్తోంది.


మంగళవారం ‘అత్రంగి రే’ బహిష్కరణ అంటూ ట్విట్టర్‌లో ట్రెండింగ్‌గా నిలిచింది. దీనికి మద్దతు తెలుపుతూ చాలా మంది నెటిజన్లు రిట్విట్‌లు, నెగిటివ్ కామెంట్లు చేశారు. అయితే ఈ సినిమాను ఎందుకు బ్లాక్ చేయమని చెబుతున్నారు..? దీనికి ప్రత్యేక కారణమేంటో తెలుసుకుందాం.. అయితే ఈ సినిమాలో హీరో అక్షయ్ కుమార్ ముస్లిం వ్యక్తి పాత్ర (సజ్జాద్ అలీఖాన్), సారా అలీఖాన్ (రింకూ రఘువంశీ) హిందూ అమ్మాయిగా పాత్రలను చూపించారు. ఇందులో సజ్జాద్ ప్రేమలో రింకూను చూపించారు.


దీనిపై నెటిజన్లు ట్విట్టర్ వేదికగా ఆందోళన చేపడుతున్నారు. ‘అత్రంగి రే’ సినిమాకు వ్యతిరేకంగా పోస్టులు పెడుతున్నారు. సినిమాను వెంటనే నిషేధించాలని డిమాండ్ చేస్తున్నారు. ‘లవ్ జిహాద్’ను హిందీ సినిమాల్లో ప్రోత్సాహిస్తున్నారని నెటిజన్లు పేర్కొంటున్నారు. వీలైనంత త్వరగా సినిమాను బహిష్కరించాలని డిమాండ్ చేస్తున్నారు.



కాగా.. చాలా మంది నెటిజన్లు హీరో అక్షయ్ కుమార్‌కు భారీగా క్లాస్ తీసుకుంటున్నారు. అక్షయ్ కుమార్ సోషల్ మీడియా వేదికగా.. దేశభక్తి, జాతీయ ప్రయోజనాల గురించి మాట్లాడుతుంటారని, కానీ వాటిని అతను స్వయంగా పాటించరని చెబుతున్నారు. అక్షయ్ కుమార్‌ను లక్ష్యంగా చేసుకుని ఒక నెటిజన్ ట్విట్టర్‌లో ఇలా కామెంట్ చేశాడు. ‘ ఈ సినిమాలో అక్షయ్ కుమార్ పాత్రను చూసి ఆశ్చర్య పోయానన్నారు. హిందువునని చెప్పుకునే అక్షయ్ ఇలాంటి పాత్రలో ఎలా నటిస్తారు. లవ్ జిహాద్‌ను స్వాగతిస్తున్నారా..? వెంటనే ఈ సినిమాను బహిష్కరించాలి. ’ అంటూ ఆయన పేర్కొన్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: