వావ్:సినిమా టికెట్ల ధరలపై.. రోజా మాటలు..!
అలా చేపట్టిన ఎన్నో కార్యక్రమాలు కు టిడిపి.. వైఎస్ఆర్సిపి ప్రభుత్వంపై బురద జల్లే ప్రయత్నం చేస్తోందని మండిపడింది. ఇక మన రాష్ట్రంలో బీజేపీ తీరు చాలా బాధాకరంగా ఉందని తెలియజేసింది ఎమ్మెల్యే రోజా. ఇక టిడిపి, బిజెపి ప్రభుత్వాలపై ప్రజలు చాలా ఆగ్రహంతో ఉన్నారని తెలియజేసింది. ఈ రెండు ప్రభుత్వాలను చూసి ప్రజలు నవ్వుకుంటున్నారని తెలియజేసింది. మేము చెప్పిన వాగ్దానాలను అన్ని అమలు చేస్తున్నాము, ఇక పోలవరం ప్రాజెక్టు కు కావలసిన నిధులను ఇవ్వకుండా బిజెపి ప్రభుత్వ చేస్తోంది అంటూ తెలియజేసింది. ఎలాంటి పరిస్థితులు ఎదురైనప్పటికీ కూడా ప్రజలకు సంక్షేమ పథకాలు అందిస్తున్నారు జగన్ అంటూ చెప్పుకొచ్చింది.
ఇక అయితే అంతలోనే ఆంధ్రప్రదేశ్లోని సినిమా టికెట్ విషయం పై రోజా స్పందించడం జరిగింది. చిన్న చిన్న సినిమాలు థియేటర్లు విడుదల చేయాలన్న.. బడా సినిమాలు ప్రజలు చూడాలన్న, టికెట్ రేట్స్ అన్ని ఒకే విధంగా ఉండాలి కాబట్టి జగన్మోహన్ రెడ్డి ఇలా చేశారని తెలియజేసింది. బడా సినిమాలు ఎక్కువ బడ్జెట్ పెట్టి సినిమా ఇస్తారు కాబట్టి అలాంటి వారు ప్రభుత్వం తో మాట్లాడు కుంటే మంచిదని తెలియజేసింది రోజా.. ఇలా చేయడం వల్ల చిన్న సినిమా పెద్ద సినిమా అనే తేడా లేకుండా అందరికీ ఉపయోగం ఉండేలా నిర్ణయం ఉంటుందని తెలిపింది రోజా.