కీర్తి సురేష్ రూట్ మార్చేసింది..!

shami
మళయాళ భామ కీర్తి సురేష్ ముందు గ్లామర్ షో విషయంలో చాలా జాగ్రత్త పడింది. నేను శైలజ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన ఈ అమ్మడు తన ప్రతి సినిమాతో ప్రేక్షకులను మెప్పిస్తూ వచ్చింది. ఇక నాగ్ అశ్విన్ డైరెక్ట్ చేసిన సావిత్రి బయోపిక్ మహానటితో నేషనల్ అవార్డ్ సైతం అందుకుంది. ఆ సినిమాతో పీక్స్ లోకి వెళ్లిన కీర్తి సురేష్ ఇమేజ్ ఆ తర్వాత అందుకు తగినట్టుగా కొనసాగించడంలో తడబడ్డది. మిగతా భాషల్లో ఎలా ఉన్నా తెలుగులో పవర్ స్టార్ తో సినిమా చేసినా అమ్మడికి లక్ కలిసి రాఏదు. ఇక రోజుకొక కొత్త హీరోయిన్ ఎంట్రీ ఇస్తున్న ఇలాంటి టైం లో కీర్తి సురేష్ పని అయిపోయిందనే అనుకున్నారు.

కానీ కీర్తి సురేష్ మాత్రం ప్రయత్నాలు చేస్తూనే ఉంది. ప్రస్తుతం అమ్మడు తన పూర్తి ఫోకస్ తెలుగు పరిశ్రమ మీద పెట్టినట్టు తెలుస్తుంది. బాలీవుడ్ తర్వాత హీరోయిన్స్ కు భారీ రెమ్యునరేషన్ ఇచ్చే టాలీవుడ్ అంటే అందరి హీరోయిన్స్ కు ఇష్టమే. అందుకే ఇక్కడ ఎలాగైనా రాణించాలని చూస్తుంది కీర్తి సురేష్. ప్రస్తుతం ఆమె నటించిన గుడ్ లక్ సఖి రిలీజ్ కు రెడీగా ఉంది. మరోపక్క సూపర్ స్టార్ మహేష్ తో సర్కారు వారి పాట సినిమాలో నటిస్తుంది. ఆ సినిమా మీదే కీర్తి సురేష్ అన్ని ఆశలు పెట్టుకుందని తెలుస్తుంది. ఇదే కాకుండా మెగాస్టార్ చిరంజీవి భోళా శంకర్ లో అమ్మడు సిస్టర్ రోల్ చేస్తుంది.

సినిమాల పరిస్థితి ఇలా ఉంటే తన సోషల్ మీడియా ఫ్లాట్ ఫాం లో మాత్రం ఫోటో షూట్స్ తో అలరిస్తుంది కీర్తి సురేష్. సినిమాల్లో గ్లామర్ షో చేయకపోయినా ఫోటో షూట్స్ లో మాత్రం రెచ్చిపోతుంది. లేటెస్ట్ గా కీర్తి సురేష్ తన ఇన్ స్టాగ్రాం లో పెట్టిన పిక్ వైరల్ గా మారింది. మిడ్ వీక్ మోనో క్రోం అంటూ కీర్తి సురేష్ స్టైలిష్ డ్రెస్ తో అలరిస్తుంది. ఈ పిక్ తో కీర్తి సురేష్ స్కిన్ షో కూడా ఆకట్టుకుంది. అవకాశాలు రావాలంటే టాలెంట్ మాత్రం కాదు ఒక్కోసారి తమ రూట్ కూడా ఛేంజ్ చేసుకోవాల్సి వస్తుంది. ఇన్నాళ్లు గ్లామర్ షో విషయంలో హద్ధులు పెట్టుకున్న కీర్తి సురేష్ ఇక మీదట అవి చెరిపేసే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తుంది.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: