ఒకప్పుడు సినిమా షూటింగులు ఇప్పటిలా అస్సలు జరిగేవి కాదు.. రోజుల తరబడి షూటింగ్స్ జరిగేవి. నటీ నటులంతా చాలా కాలం కలిసి పని చేయడం మూలంగా అందరి మధ్య మంచి అనుబంధం ఆప్యాయత ఏర్పడేది. లంచ్ సమయంలో అందరూ కలిసి ఒకే చోట కూర్చుని కలిసి భోజనం చేసేవారు. నిజానికి ఎన్టీఆర్.. మంచి భోజన ప్రియుడు. కడుపు నిండి పోయే వరకు భోజనం చేసే వాడు. ఆయన తిండి గురించి పలువురు రక రకాలుగా అనుకునేవారు. ఆయన పుడ్ గురించి అప్పుడప్పుడే సినిమాల్లోకి వచ్చిన వాణిశ్రీ కూడా ఆయన ఫుడ్ అలవాట్ల గురించి ఎన్నో కథలు విన్నదట.అది వాస్తవమో? కాదో? తెలుసుకోవాలి అనుకుందట.వాస్తవానికి అప్పట్లో ఎవరి ఇంటి నుంచి వాళ్లే క్యారేజీ తెచ్చుకునే వారట.ఎన్టీఆర్ కు మాత్రం ఇంటి నుంచి రెండు క్యారేజీలు వచ్చేవని అవి కూడా చాలా పెద్ద పెద్దగా ఉండేది. ఓ రోజు వాటిని చూసి షాక్ అయ్యిందట నటి వాణిశ్రీ. తాను విన్న మాటలు నిజమే అనుకుందట తను. ఎన్టీఆర్ భోజనం చేయడం మొదలు పెట్టాడు వాణిశ్రీ ఆయన వైపు చూస్తూనే ఉందట ఆమెను చూసి ఎన్టీఆర్.. ఏంటి వాణి శ్రీ గారు మా భోజనం రుచి చూస్తారా? అన్నాడట.. ఆమెకు తన క్యారేజీలోని వంటకాలు తీసి రుచి చూపించాడు. ఆరోజు ఆమె తిన్న భోజనాన్ని జీవితంలో మర్చిపోలేదని చెప్పిందట .
నిజంగా ఎన్టీఆర్ భోజనపు అలవాట్లు చాలా ఆశ్చర్యకరంగా ఉన్నాయని చెప్పింది.. ఆయన ఉదయాన్నే 20 కి పైగా ఇడ్లీలు తినేవాడట. పెరుగు అంటే తనకు ఎంతో ఇష్టం అని పెరుగన్నంలో ఆవకాయ తప్పకుండా వేసుకునే వాడట. ఐదు బాటిల్ల జ్యూస్ తాగేసేవాడట. డ్రై ప్రూట్స్ కూడా ఇష్టంగా తినేవాడట.బాదం పాలు కూడా తాగేవాడట. సమ్మర్ లో మామిడి పండ్ల రసం ఎంతో ఇష్టంగా తాగేవాడట. అందులో గ్లూకోజ్ పౌడర్ కూడా కలుపుకునేవాడట. అప్పుడప్పుడు అల్లం వెల్లుల్లి ముద్దను కూడా తినేవాడట. దీంతో ఆయన జీర్ణ వ్యవస్థకు ఇబ్బంది కలిగేది కాదని తెలుస్తుంది.