ఇంత లేటా : ఆ డైరెక్టర్లకు హిట్ కొట్టామనే పేరుంది.. కానీ ఏం లాభం..?

NAGARJUNA NAKKA
ఇండస్ట్రీ ఎప్పుడూ సక్సెస్‌ వెంటే పరుగులు పెడుతుంది. ఎవరు సూపర్ హిట్స్‌లో ఉంటే వాళ్లకి అడ్వాన్సులు వచ్చేస్తుంటాయి. ఫుల్‌ బిజీగా ఉంటారు. కానీ కొంతమంది దర్శకులకు మాత్రం మాత్రం సక్సెస్‌ తర్వాత కూడా గ్యాప్ వస్తోంది. సూపర్ హిట్స్‌ తర్వాత తర్వాతి సినిమా చేేసేందుకు చాలా సమయం పడుతోంది. 'పెళ్లిచూపులు, ఈ నగరానికి ఏమైంది' సినిమాలతో యూత్‌ఫుల్‌ హిట్స్ కొట్టిన దర్శకుడు తరుణ్ భాస్కర్. యాక్టర్ కమ్‌ డైరెక్టర్‌గా రెండు పడవల ప్రయాణం చేస్తోన్న తరుణ్ భాస్కర్ మళ్లీ ఎప్పుడు మెగాఫోన్ పడతాడనేది తెలియడం లేదు. వెంకటేశ్‌తో హార్స్‌ రేసింగ్ సినిమా తీస్తాడనే ప్రచారం జరుగుతున్నా లాంచింగ్‌ డేట్ ఇంకా కుదరలేదు.

కరోనా ఫస్ట్ లాక్‌డౌన్‌ తర్వాత బిగ్గెస్ట్ రొమాంటిక్ హిట్‌గా నిలిచిన సినిమా 'ఉప్పెన'. బుచ్చిబాబు సానా దర్శకత్వంలో వచ్చిన ఈ మూవీ 70 కోట్ల వరకు కలెక్ట్ చేసింది. ఈ సక్సెస్‌తో బుచ్చిబాబు టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారాడు. కానీ ఈ బ్లాక్‌బస్టర్‌ తర్వాత మరో సినిమా అనౌన్స్‌ చెయ్యలేదు బుచ్చిబాబు. జూ.ఎన్టీఆర్‌తో సినిమా ఉంటుందనే టాక్ వచ్చినా ఈ కాంబినేషన్‌ సెట్‌ కావడానికి మరింత సమయం పట్టే అవకాశముందట.

'జాతిరత్నాలు' సినిమాతో నవీన్‌ పోలిశెట్టికి ఎంత పేరు వచ్చిందో, డైరెక్టర్ అనుదీప్‌ కూడా అంతే పాపులర్ అయ్యాడు. ఈ మూవీ 50 కోట్లకి పైగా కలెక్ట్ చేసింది. అయితే ఇంత పాజిటివ్ రెస్పాన్స్ తెచ్చుకున్న అనుదీప్‌ నెక్ట్స్‌ మూవీపై ఇంకా క్లారిటీ రాట్లేదు. ఆ మధ్య శివ కార్తికేయన్‌తో బైలింగ్వల్ చేస్తాడనే ప్రచారం జరిగింది గానీ ఇంకా సినిమా లాంచ్ కాలేదు. అల్లరి నరేశ్‌ని చాన్నాళ్ల తర్వాత సక్సెస్‌ ట్రాక్ ఎక్కిచ్చిన సినిమా 'నాంది'. సెక్షన్ 211 నేపథ్యంలో విజయ్ కనకమేడల రూపొందించిన ఈ సినిమాకి విమర్శకుల నుంచి ప్రశంసలు దక్కాయి. అయితే ఈ సూపర్ హిట్‌ తర్వాత విజయ్ మరో సినిమా మొదలు పెట్టలేదు.









మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: