ఒడియమ్మా.. వర్మ తగ్గేదేలే.. అందరిని ఆ మాట అనేశాడు?
ప్రతి పండక్కీ సరికొత్త ఈవెంట్ ప్లాన్ చేస్తూ మరింత గ్రాండ్ గా మార్చడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. ప్రేక్షకులందరినీ టీవీలకు కట్టిపడేస్తూ ఉంటారు. ఈ క్రమంలోనే డిసెంబర్ 31 రోజున పెళ్ళాం వద్దు పార్టీ ముద్దు అనే ఈ ఈవెంట్ ని ప్లాన్ చేశారు. ఇక ఈ కార్యక్రమం టైటిల్ తోనే ఎంతోమందిని ఆకర్షించారు. ఇక ఎన్నో రోజుల నుంచి ఈ కార్యక్రమానికి సంబంధించి ప్రోమోలు విడుదల చేస్తూ వరుసగా బుల్లితెర ప్రేక్షకులు అందరిలో మరింత ఆసక్తిని పెంచుతున్నారు అనే విషయం తెలిసిందే. అయితే సాధారణంగా ఈ ఈవెంట్ జరగడం ఒక ఎత్తయితే ఈ కార్యక్రమానికి సెన్సేషనల్ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ రావడం మరొక ఎత్తు. వర్మ రావడంతో ఇక ఈ ఎపిసోడ్ ఎలా ఉంటుందో అని అందరిలో అంచనాలు పెరిగిపోయాయి.
ఇకపోతే ఇటీవలే పెళ్ళాం వద్దు పార్టీ ముద్దు అనే కార్యక్రమానికి సంబంధించి మరో ప్రోమో కూడా విడుదల చేశారు. ఇక ఈ ప్రోమో కూడా ఎంతో సందడి సందడి గా సాగిపోయింది అనే చెప్పాలి. ఈ ప్రోమో లో యాంకర్ రష్మీ అదిరిపోయే పర్ఫామెన్స్ తో ఆకట్టుకుంది. అదే సమయంలో అటు రామ్ గోపాల్ వర్మ కూడా అక్కడ ఉన్న జబర్దస్త్ కమెడియన్స్ అడిగిన ప్రశ్నలకు ఆసక్తికర సమాధానాలు చెప్పారు. ఆర్జివి చెప్పిన సమాధానాలతో అందరూ షాక్ అయ్యారు అని చెప్పాలి. ఇక చివరిలో స్టేజ్ మీద ఉన్న వారందరూ హ్యాపీ న్యూ ఇయర్ చెబుతారు. అదే సమయంలో వర్మ మాట్లాడుతూ హ్యాపీ న్యూ ఇయర్ చెప్పడం నాకు ఇష్టం ఉండదు కానీ ఇక్కడ ఉన్న మూర్ఖులు అందరూ సంతోష పడతారు కాబట్టి.. అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ అంటూ చెప్పి అందరినీ మాటల్లో మాటగా మూర్ఖులు అని అనేసాడు వర్మ. దీంతో అందరూ షాక్ అయ్యారు.