ఆర్ ఆర్ ఆర్ మ్యానియాను కేర్ చేయని శ్రీవిష్ణు !

Seetha Sailaja

జనవరి 7న ‘ఆర్ ఆర్ ఆర్’ విడుదల కాబోతోంది. ఎన్ని వ్యతిరేక పరిస్థితులు ఉన్నప్పటికీ ఈ మూవీకి ఏర్పడిన మ్యానియాతో ఒమైక్రాన్ భయాలు కూడ ఎదిరించవచ్చు అన్న రాజమౌళి మొండి ధైర్యం ‘ఆర్ ఆర్ ఆర్’ విడుదలకు లైన్ క్లియర్ చేసింది. ఒక్క తెలుగు రాష్ట్రాలలో మినహా ప్రతి రాష్ట్రంలోనూ నైట్ కర్ఫ్యూలు అమలు జరుగుతున్నాయి.


ఇలాంటి వ్యతిరేక పరిస్థితులను లెక్క చేయకుండా ‘ఆర్ ఆర్ ఆర్’ దూసుకు వస్తోంది. దీనితో తెలుగు రాష్ట్రాలలో ‘ఆర్ ఆర్ ఆర్’ మ్యానియా ప్రారంభం అయింది. ఇలాంటి పరిస్థితులలో ఈ మ్యానియాను లెక్కచేయకుండా ఒక చిన్న సినిమా ఈ శుక్రువారం డిసెంబర్ 31న విడుదల అవుతూ ఉండటం ఇండస్ట్రీ వర్గాలను ఆశ్చర్యపరుస్తోంది. యంగ్ హీరో శ్రీవిష్ణు నటించిన ‘అర్జున ఫల్గుణ’ మూవీ కొత్త సంవత్సర కానుకగా విడుదలకాబోతోంది.


ఈ చిన్న సినిమాకు సంబంధించిన టీజర్ అదేవిధంగా ట్రైలర్ కు మంచి స్పందన వచ్చింది. అయితే ఈ చిన్న సినిమా కేవలం 7రోజులలో ఏమాత్రం హంగామా చేయగల్గుతుంది అన్న సందేహాలు చాలామందిలో ఉన్నాయి. శ్రీవిష్ణు సినిమాలకు మంచి రివ్యూలు వచ్చి ప్రశంసలు లభిస్తున్నప్పటికీ అతడి మూవీలు కలక్షన్స్ పరంగా వెనకడుగువేస్తున్నాయి. దీనితో అతడి మార్కెట్ అంతంత మాత్రంగానే ఉంటోంది.


ఇలాంటి పరిస్థితులలో పెద్దగా మార్కెట్ లేని శ్రీవిష్ణు ‘ఆర్ ఆర్ ఆర్’ మ్యానియాను లెక్కచేయకుండా ఏధైర్యంతో తన చిన్న మూవీని రంగంలోకి దింపుతున్నాడు అంటూ ఇండస్ట్రీ వర్గాలలో చాలామంది ఆశ్చర్యపోతున్నారు. ఈమూవీ చాల తక్కువ బడ్జెట్ తో తీసిన మూవీ కావడంతో ఒక వారంరోజులు కలక్షన్స్ ఈమూవీకి సరిపోతాయి అన్న వ్యూహంతో శ్రీవిష్ణు ఉన్నాడు అనుకోవాలి. ప్రస్తుతం ‘పుష్ప’ ‘శ్యామ్ సింగ రాయ్’ మూవీల కలక్షన్స్ సంతృప్తికరంగానే ఉంటున్నాయి. ఇలాంటి పరిస్థితులలో ‘ఆర్ ఆర్ ఆర్’ విడుదల అయ్యేంతవరకు ఈ రెండు సినిమాల హవా కొనసాగుతుందని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి. అయితే ఈ అంచనాలకు భిన్నంగా ఎలాంటి అద్భుతాలు చేస్తుందో చూడాలి..






మరింత సమాచారం తెలుసుకోండి:

rrr

సంబంధిత వార్తలు: