సినిమా కథ రాసుకొని ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్న సమయంలో కొంత మంది నటీనటులను కొన్ని పాత్రలకు అనుకుంటారు, ఆ తర్వాత ఆ నటీనటులను సంప్రదించిన సందర్భాలు ఉంటాయి, కానీ చివరిగా సినిమా స్టార్ట్ అయ్యేటప్పుడు మాత్రం వారు ఆ సినిమాలో ఉండరు, ఇలాంటి సందర్భాలు చాలా సినిమాలలో జరుగుతూ ఉంటాయి. దానికి కారణం ఆ నటీనటుల డేట్లు కుదరకపోవడం, లేక ఆ సినిమాలో వారి పాత్ర నచ్చకపోవడం, ఇలా అనేక కారణాల వల్ల వారు చివరగా ఆ సినిమాలో ఉండరు.
అయితే బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ హీరోగా తెరకెక్కిన సుల్తాన్ సినిమాలో కూడా ఇలాంటి సంఘటనే జరిగిందట, ఈ విషయాన్ని స్వయంగా సల్మాన్ ఖాన్ తెలియజేశాడు. అసలు విషయంలోకి వెళితే.. బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ హీరోగా అనుష్క శర్మ హీరోయిన్ గా అలీ అబ్బాస్ జాఫర్ దర్శకత్వం లో తెరకెక్కిన సినిమా సుల్తాన్, 2016 వ సంవత్సరం విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర అదిరిపోయే బ్లాక్ బస్టర్ విజయాన్ని సాధించి 620 కోట్ల వరకు కలెక్షన్ ల యూ కూడా సాధించింది. ఇంత పెద్ద బ్లాక్ బస్టర్ విజయం సాధించిన ఈ సినిమాలో మొదట అనుష్కశర్మ కు బదులుగా హీరోయిన్ గా మృణాల్ ఠాకూర్ ని అనుకున్నారట, ఈ సినిమా తోనే ఈ ముద్దుగుమ్మ బాలీవుడ్ లో ఎంట్రీ ఇవ్వాల్సింది. కానీ అనేక కారణాల వల్ల ఈ సినిమాలో ఈ పాత్రను ఈ ముద్దుగుమ్మ పోషించలేక పోయింది, అనంతరం మృణాల్ ఠాకూర్ లవ్ సోనియా మూవీతో బాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చింది. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ జెర్సీ సినిమాలో షాహిద్ కపూర్ తో కలిసి నటించింది. ఇదిలా ఉంటే తాజాగా ఈ సినిమాను బిగ్ బాస్ 15 లో ప్రమోట్ చేశారు, ఈ సందర్భంగా ఈ విషయాన్ని సల్మాన్ ఖాన్ తెలియజేశాడు. సుల్తాన్ సినిమా కు సల్మాన్ ఖాన్, అలీ అబ్బాస్ జాఫర్ కలిసి మొదటి సారి పనిచేశారు, ఈ సినిమా అనంతరం సల్మాన్ ఖాన్ హీరోగా నటించిన రెండు మూవీలు టైగర్ జిందా హై, భరత్ అను అలీ అబ్బాస్ జాఫర్ తెరకెక్కించాడు.