ఆ స్టార్ హీరోతో సినిమా ఉంటుంది.. వర్మ క్లారిటీ?

praveen
తెలుగు చిత్ర పరిశ్రమలో ఒకప్పుడు సినిమాలతో సెన్సేషన్ సృష్టించి రికార్డులు క్రియేట్ చేసిన రాంగోపాల్ వర్మ.. ఇక ఇప్పుడు వివాదాలతో సెన్సేషన్ సృష్టిస్తూ ఉండడం గమనార్హం. వర్మ తెరకెక్కించే ప్రతి సినిమా కూడా ప్రస్తుతం ఎన్నో వివాదాలకు కారణం అవుతుంది అని చెప్పడం కంటే.. వివాదాలనే వర్మ సినిమాగా తెరకెక్కిస్తున్నాడు అని చెప్పడం బెటర్. ఇక ఎప్పుడూ ముక్కుసూటిగా మాట్లాడుతూ తన మాటలతోఅందరిని ఆశ్చర్యానికి గురిచేసే వర్మ.. తన సినిమాలతో కూడా అందరినీ అవాక్కయ్యేలా చేస్తున్నారు. హిట్టు ఫ్లాప్ ఫ్లాపులతో సంబంధం లేకుండా తాను చేయాలనుకున్న అన్ని రకాల సినిమాలను చేస్తూ ముందుకు సాగుతున్నారు రాంగోపాల్ వర్మ.



మొన్నటికి మొన్న అమ్మ రాజ్యంలో కడప బిడ్డలు లక్ష్మీస్ ఎన్టీఆర్ లాంటి సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు . ఇక ఇప్పుడు ఆశ ఎన్కౌంటర్ కూడా ఆయన పర్యవేక్షణలోనే తెరకెక్కింది అన్న విషయం తెలిసిందే. అదే సమయంలోప్రస్తుతం తెలుగు రాజకీయాల్లో ఎంతో ప్రఖ్యాతి గాంచిన కొండా దంపతుల ప్రేమ కథను 'కొండ' అనే టైటిల్తో తెరకెక్కిస్తూ ఉండడం గమనార్హం. అయితే సాధారణంగా రామ్ గోపాల్ వర్మ సినిమా తెరకెక్కిస్తున్నాడు అంటే దాదాపుగా కొత్త నటులు కనిపిస్తూ ఉంటారు. ఇక వర్మతో సినిమాలు చేయడానికి స్టార్ హీరోలు కాస్త భయపడతారు. కాబట్టి అటు వర్మ కూడా అటువైపుగా ఆలోచనలు చేయడు . ఎక్కువగా కొత్త నటులను తన సినిమాల్లో తీసుకోవడానికి మాత్రమే ఆసక్తి చూపుతాడు.


 అయితే రాంగోపాల్ వర్మతమిళ స్టార్ హీరో ఉపేంద్ర తో సినిమా చేయబోతున్నాడని గతకొన్ని రోజులుగా టాక్ వినిపిస్తోంది. ఈ క్రమంలోనే వీరిద్దరి క్రేజీ కాంబినేషన్ సినిమా అదిరిపోతుంది అంటూ ఎన్నో కథనాలు కూడా ప్రచురితమయ్యాయి. అయితే వీరిద్దరి కాంబినేషన్లో నిజంగానే సినిమా వస్తుందా లేదా అన్న దానిపై మాత్రం ఎవరికీ క్లారిటీ లేకుండా పోయింది. ఇప్పటి వరకు వీరి క్రేజీ కాంబినేషన్ పై కేవలం గాసిప్స్ మాత్రమే హల్ చల్ చేశాయి. ఇటీవలే రామ్ గోపాల్ వర్మ క్లారిటీ ఇచ్చేశాడు. ఆశ ఎన్కౌంటర్ సినిమాకు సంబంధించిన ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ తన దర్శకత్వంలో తెరకెక్కిన కొండ సినిమా విడుదలకు సిద్ధంగా ఉందని.. అంతే కాకుండా హీరో ఉపేంద్ర తో సినిమా ఉంటుంది అంటూ క్లారిటీ ఇచ్చాడు వర్మ. దీంతో క్రేజీ హీరో ఉపేంద్ర.. సెన్సేషనల్ దర్శకుడు వర్మ కాంబినేషన్ లో సినిమా అనేసరికి ఫ్యాన్స్ లో అంచనాలు పెరిగిపోతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

Rgv

సంబంధిత వార్తలు: