విజయ్ దేవరకొండ తో సుకుమార్ సినిమా లేనట్టేనా..?

Pulgam Srinivas
టాలీవుడ్ యంగ్ హీరో విజయ్ దేవరకొండ తో ఒక సినిమాను చేయబోతున్నట్లు సుకుమార్ చాలా రోజుల క్రితం ప్రకటించాడు, అయితే ఇద్దరూ ఎవరి సినిమాలతో వారు బిజీగా ఉండడం వల్ల ఇంత వరకు కూడా ఈ సినిమా ప్రారంభం కాలేదు, అయితే సుకుమార్, అల్లు అర్జున్ తో పుష్ప సినిమా పనుల్లో బిజీగా ఉండగా,  విజయ్ దేవరకొండ కూడా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న  లైగర్ సినిమాలో నటిస్తున్నాడు, ఇతరులు తమ తమ సినిమాలు పూర్తి చేసుకున్న వెంటనే వీరిద్దరి కాంబినేషన్ లో సినిమా ఉంటుంది అని చాలామంది భావించారు. ఇది ఇలా ఉంటే అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ తెరకెక్కించిన పుష్ప సినిమా రెండు భాగాలుగా తెరకెక్కుతుంది.

 ఈ చిత్రం మొదటి భాగం ఈ మధ్యనే థియేటర్ లలో విడుదలయ్యింది. ప్రస్తుతం ఈ సినిమా సక్సెస్ ను ఎంజాయ్ చేస్తున్న సుకుమార్ మరికొద్ది రోజుల్లో పార్ట్ టు షూటింగ్ ను ప్రారంభించబోతున్నాడు. అయితే చాలామంది ఈ పార్ట్ టు సినిమా పూర్తి అయిన  వెంటనే విజయ్ దేవరకొండ తో సుకుమార్ సినిమా ప్రారంభం అవుతుంది అని భావించారు. అయితే అనూహ్యంగా సుకుమార్ మరోసారి మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తో ఒక సినిమా చేయబోతున్నట్లు తెలుస్తోంది, ఇప్పటికే వీరిద్దరి కాంబినేషన్ లో రంగస్థలం లాంటి బ్లాక్ బాస్టర్ సినిమా వచ్చింది. అయితే ఇలా మరోసారి మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తో సుకుమార్ సినిమా చేయబోతున్నట్లు వార్తలు రావడంతో  విజయ్ దేవరకొండ, సుకుమార్ కాంబినేషన్ లో సినిమా ఉంటుందా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి, దానికి ప్రధాన కారణం సుకుమార్ అప్పుడెప్పుడో విజయ్ దేవరకొండ తో సినిమా చేస్తాను అని ప్రకటించినప్పటి నుండి ఆ సినిమాకు సంబంధించిన ఎలాంటి ప్రస్తావన వెలువడలేదు, అలాగే ప్రస్తుతం కూడా విజయ్ దేవరకొండ తో కాకుండా సుకుమార్ రామ్ చరణ్ తో సినిమా చేయబోతున్నట్లు వార్తలు రావడంతో ఇక విజయ్ దేవరకొండ, సుకుమార్ కాంబినేషన్ లో సినిమా ఇక లేనట్లే అని వార్తలు వస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: