ఈ ఇయర్‌లో ఈ సినీ జోడీలు ప్రత్యేకం.. ఎందుకో చెప్పుకోండి చూద్దాం..!

N.ANJI
ఈ ఏడాది రిలీజ్ అయిన సినిమాలు ఎంతో ప్రత్యేకంగా నిలిచాయి. సినీ ఇండస్ట్రీలో కొందరు స్టార్ హీరో హీరోయిన్లను చూసి సూపర్ జోడీగా భావిస్తుంటారు. వీరిద్దరు జంటగా నటించిన మూవీ ఇంకా సక్సెస్ అయితే.. అదే జోడీని దర్శక నిర్మాతలు కంటిన్యూ చేస్తుంటారు. వెండితెరపై హీరోహీరోయిన్ల కెమిస్ట్రీ బాగా వర్కౌట్ అయితే చాలు అభిమానులు సైతం ఫిక్స్ అవుతుంటారు. అలా ఈ ఏడాది రిలీజ్ అయిన కొట్టి హిట్ మూవీ జోడీల గురించి తెలుసుకుందాం.
ఈ ఏడాది కొన్ని జంటలు ప్రేక్షకులను బాగా అలరించాయి. ఒక మూవీతో సినిమా హిట్ కొట్టడంతో మరో సినిమాతోనూ అదే జోడీని రిపీట్ చేశారు దర్శక నిర్మాతలు. ఒకప్పుడు ‘సుందరకాండ, అబ్బాయిగారు, చంటి, సూర్యవంశం’ వంటి బ్లాక్ బస్టర్ హిట్ సినిమాల్లో నటించిన విక్టరీ వెంకటేశ్, మీనా.. ఇటీవల విడుదలైన ‘దృశ్యం, దృశ్యం-2’లో నటించారు. ఈ రెండు సినిమాలు కూడా ప్రేక్షకులను ఎంతగానో అలరించాయి. ఫ్యామిలీ పిక్షన్, డ్రామా, సస్పెన్స్ థ్రిల్లర్ టైప్ సాగే ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లనే కొల్లగొట్టింది.
అలాగే ప్రముఖ దర్శకుడు హరీష్ శంకర్ దర్శకత్వం వహించిన బ్లాక్ బస్టర్ సినిమా ‘గబ్బర్ సింగ్’. ఈ సినిమాలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సరసన శృతిహాసన్ నటించింది. గబ్బర్ సింగ్ బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లనే రాబట్టింది. దీంతో ఈ జోడినే ‘వకీల్‌సాబ్’ సినిమాలో కంటిన్యూ చేశారు. వకీల్‌సాబ్ కూడా మంచి హిట్ కొట్టింది. దీంతో ఈ ఏడాది ఈ జోడీ ప్రత్యేకంగా నిలిచింది.
అలాగే నేచురల్ స్టార్ నాని, సాయిపల్లవి జతగా నటించిన ‘ఎంసీఏ’ మూవీ కూడా మంచి హిట్ అందుకుంది. దీంతో ఈ ఏడాది ‘శ్యాం సింగరాయ్‌’తో మళ్లీ తెరపై కనిపించారు. ఆ తర్వాత మాస్ మహారాజ్ రవితేజ శృతిహాసన్ జంటగా నటించిన ‘బలుపు’ సినిమా గతంలో హిట్ అందుకుంది. దీంతో ఇటీవల వీరిద్దరు నటించిన ‘క్రాక్’ సినిమా ప్రేక్షకులను ఎంతగానో అలరించింది. మొత్తానికి అలా 2021 సంవత్సరంలో టాలీవుడ్ ఇండస్ట్రీలో కొన్ని జంటలు హిట్ ఫెయిర్‌గా ప్రత్యేక స్థానాన్ని దక్కించుకున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: