అసలు సీక్రెట్ బయటపెట్టిన మెగా హీరోయిన్?
అయితే ఇంజనీరింగ్ అయ్యాక మోడల్ గా కెరియర్ ను మొదలు పెట్టి అలా ఇండస్ట్రీ లోకి వచ్చి హీరోయిన్ గా అయ్యానని ఇప్పటికీ ఆ కల అలాగే ఉందని తెలిపారు. 2015 లో 'లోఫర్' సినిమాతో హీరోయిన్ గా అడుగు పెట్టిన దిశా పటాని ఆ తర్వాత ఎమ్మెస్ ధోని, ది అన్టోల్డ్ స్టోరీ ,బాఘీ 2, భారత్ , మలాంగ్ వంటి చిత్రాల్లో నటించారు. అయితే తాజాగా బజార్ మ్యాగజైన్ కవర్ పేజ్ పై మెరిసిన ఈ అందాల తార బజార్ ఇండియాకు ఇంటర్వ్యూ ఇస్తున్న సందర్భంలో తన కల నటనా రంగం కాదని పైలట్ అవ్వలన్నది తన చిరకాల వాంఛ అని చెప్పుకొచ్చింది.
తొలుత మోడల్ గా కెరియర్ ని ప్రారంభించిన దిశా పటాని అప్పటి నుండే తన సొంత ఖర్చుల కోసం ఇంట్లో వారిపై ఆధారపడకుండా పాకెట్ మనీ ఎర్న్ చేసుకునే వారు. స్వేచ్ఛాయుత జీవితమంటే తనకు ఇష్టమని ఇలా పలు ఆసక్తికర విషయాలను ప్రేక్షకులతో పంచుకుంది దిశా. అయితే ఇలా అనుకున్న రంగంలోనే రాణిస్తున్న వారు చాలా తక్కువ, కాలానికి తగినట్లు వివిధ రంగాలలో ఇష్టం ఉన్నా లేకపోయినా జీవితాన్ని గడుపుతూ ఉంటారు...