చరణ్ కు అన్నీ అలా కలిసి వస్తున్నాయి అంతే!!
ఈ చిత్రాలలో హీరోగా చేయడంతో పాటు నిర్మాతగా కూడా పలు సినిమాలను చేస్తున్నాడు చరణ్. ఇప్పటికే ఆయన మూడు సినిమాలతో ప్రేక్షకుల ముందుకు రాగా ఇప్పుడు చిరు చేస్తున్న ఆచార్య సినిమాకి కూడా రామ్ చరణ్ నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు. ఈ సినిమాలో ఆయన ఓ కీలక పాత్రలో కూడా నటించడం విశేషం. కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. చిరు కలిసి నటిస్తూ ఆ సినిమాను నిర్మించే అవకాశం రామ్ చరణ్ దక్కింది.
అయితే కేవలం నాలుగు వారాల గ్యాప్ లోనే చరణ్ నటించిన ఆర్ఆర్ఆర్ మరియు చిరంజీవి నటించిన ఆచార్య సినిమాలు రెండూ కూడా విడుదల కాబోతున్నాయి. అయితే రామ్ చరణ్ నటించిన మగధీర సినిమా రంగస్థలం సినిమా లు పీరియాడిక్ గా తెరకెక్కగా ఆ సినిమా లు సూపర్ సక్సెస్ కావడంతో అభిమానులు ఈ రెండు సినిమాలపై భారీ స్థాయిలో అంచనాలను పెట్టుకున్నారు. అయితే ఈ రెండు సినిమాల విడుదలలు ఒక నెల వ్యవధిలో విడుదల కావడం అందులోనూ మంచి సమయంలో విడుదల కావడంతో ఈ రెండు సినిమాల పరంగా ఆయనకు బాగానే కలిసి వస్తుందని చెప్పవచ్చు. మరి ఈ కలిసి వచ్చిన కాలంలో ఆయనకు ఎలాంటి విజయాలు వరిస్తాయో చూడాలి. రెండు సినిమాలతో భారీగా విజయాలు అందుకుంటాడా చూడాలి.