RRR యుఎస్ టార్గెట్ ఎంతో తెలుసా..?
ఏ టైం లో లాక్ డౌన్ అంటారో అని చెప్పుకుంటున్నారు. ఈ క్రమంలో ఆర్.ఆర్.ఆర్ టీం ను కొన్న యూఎస్ డిస్ట్రిబ్యూటర్స్ ను కంగారు మొదలైంది. ఆర్.ఆర్.ఆర్ సినిమాను సరిగమ సంస్థ 41 కోట్లకు కొంగోలు చేసింది. అక్కడ 20 మిలియన్ తెస్తే కాని హిట్ అనిపించ్కోదు. మరి ఈ టైం లో ఒమిక్రాన్ విజృభిస్తే అక్కడ బయ్యర్ల పరిస్థితి మాత్రం దారుణంగా ఉంటుందని చెప్పొచ్చు. ఇండియాలో కొన్నిచోట్ల మాత్రమే థియేటర్లు ఆపగా... నార్త్ సైడ్ కొన్ని థియేటర్ లు 50 పర్సెంట్ ఆక్యుపెన్సీ తో నడిపిస్తున్నారు.
ఆర్.ఆర్.ఆర్ సినిమా తెలుగు రెండు రాష్ట్రాల్లో 250 కోట్ల బిజినెస్ చేసింది. అంటే బాహుబలి 2 కలెక్ట్ చేసినంత బిజినెస్ చేసింది. మరి ఈ లెక్కన తెలుగు రాష్ట్రాల్లో ట్రిపుల్ ఆర్ ఎలాంటి సంచలనాలు సృష్టిస్తుందో చూడాలి. ఏపీలో లేటెస్ట్ గా థియేటర్ ఇష్యూకి 3 వారాలు బ్రేక్ దొరికింది. ఈలోగా సంక్రాంతి సినిమాల సందడి షురూ కానుంది. ఆర్.ఆర్.ఆర్, రాధే శ్యామ్ సినిమాలకు ఇది మంచి విషయమే అని చెప్పాలి.