ప్రభాస్, అల్లు అర్జున్ చేయనిది.. ఎన్.టి.ఆర్, చరణ్ చేస్తున్నారు..!
ఇక ఇప్పుడు ఆర్.ఆర్.ఆర్ అంటూ ఎన్.టి.ఆర్, రాం చరణ్ కూడా పాన్ ఇండియా వైడ్ సత్తా చాటాలని చూస్తున్నారు. అయితే ఆర్.ఆర్.ఆర్ సినిమాకు హిందీ వర్షన్ కి కూడా ఎన్.టి.ఆర్, రాం చరణ్ సొంత డబ్బింగ్ చెప్పారు. తెలుగు సినిమాలు హిందీ డబ్బింగ్ నాన్ సింక్ అవుతుందని తారక్ ఆలోచన. అందుకే చరణ్, ఎన్.టి.ఆర్ ఇద్దరు వారి సొంత గొంతునే వాడేస్తున్నారు.
ప్రభాస్ కూడా పాన్ ఇండియా సినిమాలు చేస్తున్నా తన సొంత డబ్బింగ్ చెప్పడం లేదు. పుష్ప సినిమా విషయంలో కూడా అల్లు అర్జున్ హిందీ వర్షన్ డబ్బింగ్ ఆర్టిస్ట్ లకు ఇచ్చాడు. అక్కడ భాష మీద పట్టులేకపోవడం వల్ల సరైన అవుట్ పుట్ రాదని బన్నీ ఆలోచన. కానీ తారక్, చరణ్ మాత్రం అలా కాకుండా తమ సొంత వాయిస్ తోనే హిందీ డబ్బింగ్ చెప్పేశారు. ఆర్.ఆర్.ఆర్ కోసం తారక్, చరణ్ పడిన కష్టానికి తగిన ఫలితం రావడం పక్కా అని చెబుతున్నారు చిత్రయూనిట్. ప్రభాస్, అల్లు అర్జున్ హిందీ డబ్బింగ్ కు నో చెబితే తారక్, చరణ్ లు మాత్రం సై అనేశారు. ఆర్.ఆర్.ఆర్ సినిమా నేషనల్ వైడ్ గా బీభత్సమైన క్రేజ్ తో రిలీజ్ అవుతుంది. జనవరి 7న ఆర్.ఆర్.ఆర్ వస్తుండగా ప్రభాస్ రాధేశ్యామ్ జనవరి 14న రిలీజ్ ప్లాన్ చేశారు.