బాలీవుడ్ : ఆగని కరోనా ప్రకంపనలు.. ఆ అందాల తారకు కరోనా..?
తన ఇన్స్టాగ్రామ్ స్టోరీలలో పోస్ట్ షేర్ చేస్తూ.. ప్రస్తుతం నేను కరోనాతో పోరాడుతున్నానని, నిజం చెప్పాలంటే ఈ వైరస్ నన్ను తీవ్రగా ఇబ్బంది పెడుతుందని.. గత కొద్ది రోజులుగా మంచానికే పరిమితం అయ్యాను. ప్రస్తుతం వైద్యుల సమక్షంలో చికిత్స తీసుకుంటున్నాను. దయచేసి అందరూ అప్రమత్తంగా ఉండాలని సూచించింది. కరోనా వైరస్‌పై విజయం సాధించడానికి నేను ప్రయత్నిస్తున్నాను. మనకు ఆరోగ్యం కంటే ముఖ్యమైనది ఏదీ లేదు. జాగ్రత్తగా సురక్షితంగా ఉండండి అని ఫ్యాన్స్‌కు నోరా ఫతేహి సూచించినది.
బాలీవుడ్ స్పెషల్ సాంగ్‌కు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచిన నోరా తెలుగు ప్రేక్షకులకు కూడా పరిచయం అయిన హీరయిన్. జూనియర్ ఎన్టీఆర్ నటించిన టెంపర్ సినిమా, ఇట్టాగే రెచ్చిపోనా అని మొదటిసారి టాలీవుడ్ ఆడియన్స్ పలుకరించింది. అందాల తార ఆ తరువాత బాహుబలి సినిమా మనోహరి పాటతో దేశవ్యాప్తంగా క్రేజ్ తెచ్చుకుంది. కిక్-2 షేర్, లోఫర్, ఊపిరి, సినిమాలలో పాటలకు కూడా అద్భుతంగా డ్యాన్స్ చేసి అలరించినది. ఆ తరువాత పలు టీవీ షోలు, డ్యాన్స్ రియాలిటీ కార్యక్రమాల్లో పాల్గొంటూ బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటుంది. ఇక సోషల్ మీడియాలో ఆమెకు ఉన్న అభిమానగణం అంతా ఇంతా కాదు. నిత్యం ఆమె షేర్ చేసే గ్లామరస్, ఫ్యాషనబుల్ ఫొటోలకు లక్షలాది లైకులు, కామెంట్లు వస్తూ ఉంటాయి. ఇలా టాలీవుడ్, బాలీవుడ్లో ఈ అందాల తార దూసుకెళ్లుతున్నది.