మహేష్ త్రివిక్రమ్ లకు అతడు ఛాయలు !

Seetha Sailaja
త్రివిక్రమ్ శ్రీనివాస్ మహేష్ ల కాంబినేషన్ లో ముచ్చటగా మూడవసారి రాబోతున్న మూవీకి సంబంధించి ఒక ఆసక్తికర విషయం ఇప్పుడు ఇండస్ట్రీ వర్గాలలో హడావిడి చేస్తోంది. మహేష్ త్రివిక్రమ్ ల మొదటి సినిమా ‘అతడు’ ఛాయలో ఈమూవీ ఉంటుందని ఈమూవీలో మహేష్ ఎప్పుడు చాల సీరియస్ గా కనిపిస్తాడనీ హీరోయిన్ మాత్రం చాల బబ్లీగా ఎప్పుడు నవ్వుతూ ఎదుటి వారిని ఆట పట్టించే విధంగా ఉండేడట్లు త్రివిక్రమ్ ఆ క్యారెక్టర్ ను డిజైన్ చేసాడని అంటున్నారు.


ఆమధ్య మహేష్ కాలికి శస్త్ర చికిత్య అయిన తరువాత ప్రస్తుతం మహేష్ దుబాయ్ లో విశ్రాంతి తీసుకుంటున్న పరిస్థితులలో త్రివిక్రమ్ స్వయంగా దుబాయ్ వెళ్ళి మహేష్ కు ఈమూవీ కథ ఫైనల్ స్క్రిప్ట్ వినిపించి అతడి చేత ఓకె అనిపించుకున్నట్లు టాక్. మహేష్ తన కాలికి అయిన ఆపరేషన్ నుండి ఫిబ్రవరి నెలలో కోలుకుని వెంటనే ‘సర్కారు వారి పాట’ మూవీకి సంబంధించిన పెండింగ్ షూటింగ్ ను వేగంగా పూర్తిచేసి ఆతరువాత వెనువెంటనే త్రివిక్రమ్ సెట్స్ పైకి వస్తానని వాగ్దానం చేసినట్లు తెలుస్తోంది.


ఈమూవీ హీరోయిన్ ఎంపికలో మార్పులు జరిగినట్లు ఇప్పుడు ఇండస్ట్రీలో వార్తల హడావిడి మొదలైంది. మొదట్లో ఈమూవీకి హీరోయిన్ గా పూజా హెగ్డే ని అనుకున్నారు. అయితే ఆమె డేట్స్ దొరికే విషయంలో సమస్యలు ఏర్పడటంతో ఇప్పుడు అనూహ్యంగా ఈఅవకాశం సమంతకు లభించినట్లు వార్తలు వస్తున్నాయి. త్రివిక్రమ్ సమంతల మధ్య ఉన్న పరిచయం రీత్యా మళ్ళీ త్రివిక్రమ్ సమంతకు ఓటు వేసినట్లు టాక్.


వాస్తవానికి త్వరలో కొరటాల దర్శకత్వంలో జూనియర్ ఎన్టీఆర్ నటించబోయే మూవీలో కూడ సమంత హీరోయిన్ గా ఎంపిక అయ్యే అవకాశాలు ఉన్నాయి అంటూ ఆమధ్య తెగ వార్తలు వచ్చాయి. ఇప్పుడు లేటెస్ట్ గా సమంత మహేష్ పక్కన హీరోయిన్ గా ఎంపిక అయింది అంటున్నారు. ఇలా రెండు భారీ సినిమాలకు సంబంధించిన వార్తలలో ఇప్పుడు సమంత పేరు ప్రముఖంగా వినిపిస్తూ ఉండటంతో తిరిగి సమంత పూర్తిగా ట్రాక్ లోకి వచ్చింది అనుకోవాలి..

 


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: