ఫిబ్రవరిలో టాలీవుడ్ స్టార్ హీరోల బాక్సాఫీస్ పోరు..!

Pulgam Srinivas
దాదాపు తెలుగు స్టార్ హీరోలు ఎక్కువ శాతం ఫిబ్రవరి నెల తో పోలిస్తే సంక్రాంతి పండక్కే తన సినిమాలను విడుదల చేయాలనే ఆలోచనలో ఉంటారు, దానికి ప్రధాన కారణం పండగ సెలవులు రావడం. కానీ ఈ సంవత్సరం మాత్రం సంక్రాంతి పండగ కంటే ఫిబ్రవరి నెలలోనే ఎక్కువ సినిమాలు విడుదల అవుతున్నాయి. అలా ఫిబ్రవరి నెలలో బాక్సాఫీస్ వద్ద తలపడానికి సిద్ధంగా ఉన్న సినిమాల గురించి తెలుసుకుందాం.. మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం నటిస్తున్న సినిమాలో ఆచార్య సినిమా ఒకటి, ఈ సినిమాకు కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్నాడు, మెగాస్టార్ చిరంజీవి సరసన ఈ సినిమాలో కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తోంది, అలాగే మరో ముఖ్యమైన పాత్రలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కనిపించబోతున్నాడు, ఈ సినిమాలో రామ్ చరణ్ కు జంటగా పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తోంది, ఈ సినిమాను ఫిబ్రవరి 4 వ తేదీన విడుదల చేయబోతున్నట్లు కొన్ని రోజుల క్రితమే చిత్ర బృందం ప్రకటించింది.


ఈ సినిమాతో పాటు ఫిబ్రవరి లో మాస్ మహారాజా రవితేజ హీరోగా డింపుల్ హయాతి, చౌదరి హీరోయిన్ లుగా రమేష్ వర్మ  దర్శకత్వంలో తెరకెక్కిన ఖిలాడి సినిమా కూడా విడుదల కాబోతుంది, ఈ సినిమా ఫిబ్రవరి 11వ తేదీన విడుదల కాబోతుంది. ఈ ఇద్దరు స్టార్ హీరోల సినిమాలతో పాటు ఫిబ్రవరి నెలలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, దగ్గుబాటి రానా హీరోలుగా సాగర్ కే చంద్ర దర్శకత్వంలో మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ స్క్రీన్ ప్లే లో తెరకెక్కుతున్న భీమ్లా నాయక్ సినిమా కూడా విడుదల కాబోతుంది, ఈ సినిమాని మొదట జనవరి 13 వ తేదీన విడుదల చేయాలని అనుకున్నారు, కాకపోతే కొన్ని కారణాల వల్ల ఈ సినిమాను ఫిబ్రవరి 25 వ తేదీన విడుదల చేయబోతున్నట్లు ప్రకటించారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: