దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వం లో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ హీరోలుగా తెరకెక్కిన సినిమా ఆర్ఆర్ఆర్, ఈ సినిమాలో ఆలియా భట్, ఒలీవియా మోరిస్ హీరోయిన్ లుగా నటిస్తుండగా అజయ్ దేవగన్, సముద్ర కని మరో ముఖ్య పాత్రలో కనిపించబోతున్నారు, ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన కొన్ని ప్రచార చిత్రాలను చిత్ర బృందం విడుదల చేయగా వీటికి జనాల నుండి అదిరిపోయే రెస్పాన్స్ రావడం మాత్రమే కాకుండా ఈ సినిమాపై ఇప్పటికే ఉన్న అంచనాలను అమాంతం పెంచేశాయి. ఈ సినిమాను ఎంతో ప్రతిష్టాత్మకంగా భారీ బడ్జెట్ తో డివివి దానయ్య నిర్మిస్తున్నాడు, ఈ సినిమా జనవరి 7 వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా విడుదల కాబోతుంది.
ఇలా ఈ సినిమా విడుదల తేది దగ్గర పడడంతో ఈ చిత్ర బృందం ప్రమోషన్ ల స్పీడ్ పెంచింది, అందులో భాగంగా ఇప్పటికే దేశంలోని ప్రధాన నగరాల్లో ప్రెస్ మీట్ లను నిర్వహించింది, అలాగే పలు టీవీ ఛానల్ ఇంటర్వ్యూ లలో పాల్గొంటున్నారు, ఇప్పటికే ఆర్ఆర్ఆర్ చిత్ర బృందం ముంబై, చెన్నై లాంటి దేశంలోని ప్రధాన నగరాలలో ప్రీ రిలీజ్ ఈవెంట్ ఫంక్షన్ లను కూడా ముగించింది. అయితే ఈ క్రమంలో దర్శకధీరుడు రాజమౌళి నిర్మాత డివివి దానయ్య గురించి మాట్లాడుతూ... దానయ్య గారితో 13 ఏళ్ల నుండి సినిమా చేద్దాం అని అనుకున్నాను, మర్యాద రామన్న టైం లో అడిగితే మీతో సినిమా తీస్తే అది చాలా భారీగా ఉండాలి అని అన్నారు. అందుకే ఆర్ఆర్ఆర్ సినిమా ఆయనతో తీశాను అని రాజమౌళి తెలియజేశాడు, రాజమౌళి తో సినిమా తీయడానికి 13 సంవత్సరాలు ఎదురు చూసి ఆర్ఆర్ఆర్ తో తన కోరికను డి.వి.వి. దానయ్య తీర్చుకున్నాడు. ఈ సినిమాలో దాదాపు నాలుగు వందల కోట్ల బడ్జెట్ తో దానయ్య నిర్మిస్తున్నాడు.