ఆర్ఆర్ఆర్ : రాజమౌళి కి తెలుగంటే లోకువా..?

N ANJANEYULU
టాలీవుడ్ ఇండ‌స్ట్రీలోనే బాహుబ‌లి త‌రువాత బిగ్గేస్ట్ మ‌ల్టీస్టార‌ర్‌గా రూపొందుతున్న సినిమా  ఆర్ఆర్ఆర్ (రౌద్రం,రణం, రుధిరం) విడుద‌ల‌వ్వ‌డానికి ఇంకా  ఆరు రోజుల  స‌మ‌యం మాత్ర‌మే ఉన్న‌ది. ఓవ‌ర్సిస్ ప్రీమియ‌ర్‌ల‌ను లెక్క‌లోకి తీసుకుంటే మాత్రం కేవ‌లం ఐదు రోజుల స‌మ‌యమే ఉంటుంది. గ‌త కొన్ని వారాలుగా ఆర్ఆర్ఆర్ టీమ్ మెంబ‌ర్స్ అంద‌రూ ప్ర‌మోష‌న్‌ల‌లో చాలా బిజీగా ఉన్నారు. ఆర్ఆర్ఆర్ టీమ్ ఇప్ప‌టికే మ‌హారాష్ట్ర, కేర‌ళ‌, త‌మిళ‌నాడు, క‌ర్నాట‌క రాష్ట్రాల‌లో ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వ‌హించారు.


అయితే అస‌లు సిసలైన తెలుగు రాష్ట్రాల‌లో మాత్రం ఆర్ఆర్ఆర్ టీమ్ ఎటువంటి ఈవెంట్ ప్లాన్ మాత్రం చేయ‌లేదు. అయితే తెలుగు అంటే రాజ‌మౌళికి అంత లోకువా అనే టాక్ వినిపిస్తోంది. ప్ర‌స్తుతం దీని గురించే అంద‌రూ చర్చించుకుంటూ ఉన్నారు. తెలుగు రాష్ట్రాల‌లో ఆటోమెటిక్‌గా వారే చూస్తారు.. రాజ‌మౌళి అంటే ఓ బ్రాండ్ అనే విధంగా ఉన్న‌ట్టు కొంద‌రూ పేర్కొంటున్నారు.  తెలుగు రాష్ట్రాల‌లో ఆర్ఆర్ఆర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఎప్పుడు అని తెలుగు ప్రేక్ష‌కులు ఆర్ఆర్ఆర్ మూవీ మేక‌ర్స్ ను సోష‌ల్ మీడియాలో ప్ర‌శ్నిస్తున్నారు.      

అయితే తాజాగా వ‌స్తున్న వార్త‌ల‌పై తెలుగు రాష్ట్రాల‌లో ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వ‌హించ‌ని స‌మాచారం తెలుస్తోంది. తెలుగు రాష్ట్రాల‌లో  ఓవైపు రాజ‌మౌళి.. మ‌రోవైపు జూనియ‌ర్ ఎన్టీఆర్‌, ఇంకొక వైపు రామ్‌చ‌ర‌ణ్ లు అంటే అభిమానులు ఆటోమెటిక్‌గా వాళ్ల సినిమాల‌ను చూస్తారు అని.. మిగ‌తా రాష్ట్రాల్లో వారి మార్కెట్‌ను పెంచుకునేందుకు ప్రీ రిలీజ్ వంటి ఈవెంట్లు, ప్ర‌మోష‌న్లు ఎక్కువ‌గా నిర్వ‌హిస్తున్నారు. ఇక్క‌డ భారీ హైప్ ఉంద‌నే ప్రీ రిలీజ్ ఈవెంట్ చేయ‌రు అని టాక్ వినిపిస్తుంది. ప్రీ రిలీజ్ ఈవెంట్ చేసేది ఉంటే ఈ పాటికి చూసేవార‌ని మ‌రికొంద‌రూ పేర్కొంటున్నారు.

ఆర్ఆర్ఆర్ ఈవెంట్ జ‌రిగితే.. భారీగా అభిమానులు హాజ‌ర‌వుతార‌ని.. అస‌లే క‌రోనా కార‌ణంగా.. ఇప్పుడు ఈవెంట్ నిర్వ‌హిస్తుంటే క‌ష్ట‌మ‌ని భావిస్తున్నార‌ని మ‌రొక టాక్‌. తెలుగులో ఎలాగో హైప్ ఉంది కాబట్టి.. మిగ‌తా రాష్ట్రాల‌లో ప్ర‌మోట్ చేయ‌డం ముఖ్య‌మ‌ని ఈవెంట్ నిర్వ‌హిస్తున్నారు. మ‌రోవైపు ఇటీవ‌ల ఎల్బీస్టేడియంలో ఆర్ఆర్ఆర్ ఈవెంట్ భారీ స్థాయిలో నిర్వ‌హించ‌నున్నారు అనే వార్త వినిపించిన‌ప్ప‌టికీ అవ‌న్నీ నిజం కాదు అని తెలుస్తుంది.  తెలుగు ప్రేక్ష‌కులు మాత్రం ఎందుకు రాజ‌మౌళికి తెలుగు అంటే ఇంత లోకువా.. తెలుగు అభిమానులు లేనిది ఆయ‌న ఇంత స్థాయికి ఎదిగారా అని పేర్కొంటున్నారు.  ఇంకా వారం రోజుల స‌మ‌యం ఉండ‌డంతో అప్ప‌టిక‌ప్పుడు ఏమైనా ఈవెంట్ నిర్వ‌హిస్తారా.. లేక అలాగే ఉండిపోతారా అనేది మాత్రం తెలియాల్సి ఉంది.




మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: