లైగర్ లో హైలెట్ సీన్ ఇదే..

Satvika
రౌడీ హీరో విజయ్ దేవరకొండ నటిస్తున్న 'లైగర్' నుండి ఫస్ట్ గ్లింప్స్ విడుదలైంది. డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ తెరకెక్కిస్తున్న చిత్రం లైగర్. రౌడీ హీరో విజయ్ దేవరకొండ హీరో గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే హీరోయిన్‌గా నటిస్తుంది.. ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకున్నారు.. అన్నీ కార్యక్రమాల ను కూడా పూర్తీ చేసిన విషయం తెలిసిందే. అయితే ఈ సినిమా నుంచి ఇప్పటివరకు వచ్చిన టీజర్లు, ట్రైలర్ లు ఈ సినిమా పై భారీ అంచనాలను పెంచుతున్నాయి.


ఇది ఇలా ఉండగా.. న్యూ ఇయర్ కానుకగా శుక్రవారం సినిమా ఫస్ట్ గ్లిమ్స్ ను చిత్ర బృందం రిలీజ్ చేసింది. ఇందులో విజయ్ దేవరకొండ ను స్లమ్ డాగ్ గా.. ముంబై వీధుల్లో చాయ్ వాలా నుంచి అంతర్జాతీయ బాక్సర్ గా ఎదిగినట్లు చూపించారు. పాన్ ఇండియా మూవీ కావడంతో ముంబై నేపథ్యాన్ని ఎంచుకున్నట్లు తెలుస్తోంది. ఆ వీడియో లో మార్షల్ గురించి ప్రత్యెకం గా చూపించారు. మొత్తానికి సినిమా అంతా అవే సీన్లు ఉంటాయని తెలుస్తుంది.


ఈ సినిమా లో బాక్సర్ గా కనిపించడానికి విజయ్ చాలా కష్ట పడినట్లు తెలుస్తుంది. వీ ఆర్ ఇండియన్స్' అంటూ దేశభక్తిని పెంపొందించేలా తన వాయిస్ ని గట్టిగా వినిపించాడు. అలానే చివర్లో 'వాట్ లగా దేంగే' అంటూ ప్రత్యర్థులకు వార్నింగ్ కూడా ఇస్తున్నాడు రౌడీ బాయ్. మొత్తం మీద ఈ గ్లిమ్స్ మొత్తం యువత ఆకర్షిస్తుంది. ఈ సినిమా మొత్తం దేశ భక్థిని పెంచెలా వుంటుంది. దీంతో అంచనాలు మరింత పెరిగాయి.. ఏడాది ఆగస్టు 25వ తేదీన లైగర్ సినిమా ను థియేటర్ల లో ప్రపంచవ్యాప్తంగా విడుదల చేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించారు.. అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమా పై విజయ్ ఆశలు భారీగానే పెట్టుకున్నారు.



మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: