టాలీవుడ్ కి మళ్ళీ "ఒటిటి"లే దిక్కా... ?
పరిస్థితి చేయి దాటాక ముందే జాగ్రత్త పడాలని హెచ్చరిస్తున్నారు. మరో వైపు న్యూ ఇయర్ సెలబ్రేషన్ లు మొదలయ్యాయి, పెద్ద పండుగ వేడుకలు షురూ అవుతున్నాయి. ఇలాంటి టైం లో ఏమాత్రం అశ్రద్ద వహించినా ఒమిక్రాన్ వ్యాప్తి గణనీయంగా పెరుగుతుందని శాస్త్రవేత్తలు అభిప్రాయపడుతున్నారు. అయితే ఈ నేపథ్యంలో సినీ పరిశ్రమలో గందరగోళ పరిస్థితి నెలకొంది. రిలీజ్ అవ్వాల్సిన బడా చిత్రాలు చాలానే ఉన్నాయి. ముఖ్యంగా ఆర్ ఆర్ ఆర్, రాధేశ్యామ్, భీమ్లా నాయక్ వంటి భారీ చిత్రాలు సైతం రేసులో ఉన్నాయి.
కాగా తొందరపడి థియేటర్లలో రిలీజ్ చేస్తే పరిస్థితులు తారుమారై థియేటర్లకు తాళాలు పడినా లేదా ఒమిక్రాన్ భయంతో జనాలు సినిమాలు చూడటానికి థియేటర్స్ కి రాకపోయినా పరిస్థితి ఏంటి అన్న ఆందోళన ఇండస్ట్రీలో అందరిలోనూ కనిపిస్తోంది. ఇప్పటికే పలువురు నిర్మాతలు రిస్క్ చేయడం ఎందుకని ఓ టి టి లలో తమ చిత్రాలను రిలీజ్ చేసేందుకు డీల్ కుదుర్చుకున్నట్లు తెలుస్తోంది. మరి కొందరు ఇంకో వారం పరిస్థితిని బట్టి షిఫ్ట్ అవుదాం అని హోల్డ్ లో పెట్టారట. మొత్తానికి మళ్ళీ సినిమాలు అన్నీ ఓటిటికే ఒకే చెప్పేలా కనిపిస్తోంది.