వైరల్ అవుతున్న అనుపమ లేటెస్ట్ పిక్స్..!
'అ ఆ' సినిమాలో అనుపమ గడుసు పిల్లగా అదరగొట్టిన విషయం అందరికి తెలిసిందే. ఆ తర్వాత వరుసగా తెలుగులో సినిమాలు చేస్తూనే ఉందట ఈ మలయాళీ కుట్టి. అనుపమ ప్రస్తుతం నటిస్తున్న సినిమాల విషయానికి వస్తేఈ భామ ప్రస్తుతం దిల్ రాజు బ్యానర్‌లో ఓ సినిమా చేస్తోంది. దిల్ రాజు మేనల్లుడు అశిష్ రెడ్డి హీరోగా అరంగేట్రం చేస్తున్న చిత్రంలో అనుపమ హీరోయిన్‌గా చేస్తోందని సమాచారం..
ఈ చిత్రాన్ని 'హుషారు' దర్శకుడు అయిన శ్రీ హర్ష కొనుగంటి రూపొందిస్తున్నారట.ఈ సినిమాకు ‘రౌడీ బాయ్స్’ పేరు పెట్టిందట చిత్రబృందం. రాక్‌స్టార్ దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తోన్న ఈ చిత్రానికి మది సినిమాటోగ్రఫీ అందిస్తున్నారట.. టాలీవుడ్ నటి బ్యూటీ అనుపమ పరమేశ్వరన్ తన అందంతో, స్మైల్ తో ఎంతోమంది అభిమానుల హృదయాలను దోచుకుందట.తన నటనతో మంచి గుర్తింపు తెచ్చుకుందని తెలుస్తుంది.
అతి తక్కువ సమయంలో టాలీవుడ్ లో మంచి క్రేజ్ సంపాదించుకుందట.తెలుగుతో పాటు మలయాళం మరియు తమిళ భాషలలో కూడా నటించి అక్కడ కూడా మంచి అభిమానాన్ని సొంతం చేసుకుందట. ఇక సోషల్ మీడియాలోను ఎప్పుడు యాక్టివ్‌గా ఉంటూ అభిమానులకు దగ్గరగా ఉంటుందట ముద్దుగుమ్మ. ఇక ఈ నేపథ్యంలోనే అనుపమ తాజాగా ఓ ఫోటో షేర్ చెయ్యగా అది వైరల్ గా మారింది. ఆ ఫొటోలో అనుపమ కర్లీ హెయిర్ తో ఉండగా షర్ట్ కు ముడివేసి రెచ్చిపోయిందట. దీంతో ఆ ఫోటో ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారిందని తెలుస్తుంది.