మహేష్ vs విజయ్ vs యశ్..!
ఇక ఏప్రిల్ లో కోలీవుడ్ స్టార్ విజయ్ బీస్ట్ కూడా రిలీజ్ ఎనౌన్స్ చేశారు. విజయ్ సినిమా రిలీజ్ అంటే కోలీవుడ్ లో ఆ హంగామా వేరేలా ఉంటుంది. అయితే తెలుగు సినిమాలు కోలీవుడ్డ్ లో ఎలాగైతే గ్రాండ్ గా రిలీజ్ చేస్తున్నారో ఇప్పుడ్డు తమిళ సినిమాలు కూడా తెలుగులో అంతే గ్రాండ్ గా రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు. విజయ్ బీస్ట్ తెలుగులో గట్టి పోటీ ఇచ్చేందుకు రెడీ అవుతుంది. ఏప్రిల్ లో మరో క్రేజీ సినిమా కె.జి.ఎఫ్ చప్టర్ 2 కూడా రాబోతుంది. కె.జి.ఎఫ్ చాప్టర్ 1 సంచలనాలు సృష్టించగా చాప్టర్ 2 మీద భారీ అంచనాలు ఉన్నాయి.
ఇక ఇప్పుడు కె.జి.ఎఫ్ చాప్టర్ 2 సినిమా సౌత్ లో సత్తా చాటాలని చూస్తుంది. చాప్టర్ 1 కన్నా ఈ సినిమాను అన్ని భాషల్లో భారీ రేంజ్ లో రిలీజ్ చేయబోతున్నారు. సో ఏప్రిల్ లో మహేష్ తో పాటుగా విజయ్, యశ్ లు కూడా బాక్సాఫీస్ ఫైట్ కు సిద్ధమవుతున్నారు. అయితే మహేష్ సర్కారు వారి పాట ఏప్రిల్ 1న రిలీజ్ ఫిక్స్ చేయగా కె.జి.ఎఫ్ చాప్టర్ 2 ఏప్రిల్ ఎండింగ్ లో వస్తుంది. సో ఈ రెండిటి మధ్య పెద్దగా పోటీ ఉండే ఛాన్స్ కనిపించడం లేదు. విజయ్ బీస్ట్ ఏప్రిల్ రిలీజ్ అన్నారు కానీ డేట్ ఎప్పుడో తెలిస్తే ఏ సినిమాకు ఎఫెక్ట్ పడే అవకాశం ఉందో చెప్పొచ్చు.