అయ్యో: ఈ ఏడాదైనా పవన్ తో ఈమె ఫేట్ మారుతుందా..!

Divya
డైరెక్టర్ పూరీ జగన్నాథ్, హీరో రామ్ కాంబినేషన్ లో వచ్చిన చిత్రం ఇస్మార్ట్ శంకర్. ఇందులో ఒక కథానాయికగా నిధి అగర్వాల్ నటించింది. ఇక ఈ సినిమా మంచి బ్లాక్ బస్టర్ హిట్ ను అందుకుంది. అయితే ఇంతటి సక్సెస్ అందుకున్నప్పటికీ కూడా ఈమె సినిమాల విషయంలో చాలా వెనుకబడి ఉందని సమాచారం. ఇక కోలీవుడ్ లో కూడా ఇదే పరిస్థితి కొనసాగుతోంది ఈ ముద్దు గుమ్మది. ఈమె చేతిలో ఉన్న ఒకే ఒక్క పెద్ద అవకాశం పవన్ కళ్యాణ్ సినిమాలో కథానాయికగా నటించడం. ఇక ఆ సినిమానే హరిహర వీరమల్లు.


ఇక ఈ సినిమాకి డైరెక్టర్ క్రిష్ దర్శకత్వం వహిస్తున్నారు .కాబట్టి ఈమె పాత్రకు చాలా ప్రాధాన్యత ఉంటుందని చెప్పవచ్చు. అయితే ఇప్పుడున్న పరిస్థితులను బట్టి చూస్తే ఈమె ఈ సినిమాపై భారీగానే ఆశలు పెట్టుకున్నట్లుగా తెలుస్తోంది. ఇక ఈ ఏడాది ఈ సినిమా తో ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ సినిమా ఒక వేళ హిట్ అయినట్లయితే పవన్ కళ్యాణ్ ఈమె ఫేట్ మార్చినట్లు అని సినీ ఇండస్ట్రీలో టాక్. ఇక ఈమె సినిమాలలో రొమాంటిక్ సీన్ లకు చాలా దూరంగా ఉంటుంది. ఇక ఒక సారి వివాదాస్పదమైన డైరెక్టర్ ప్రైవేట్ పార్టీలో ఆమెను ఎంతో ఇబ్బంది పెట్టినట్లుగా సమాచారం.. ఆమె ఇబ్బంది పడుతూ ఉండడం గమనించిన పూరి జగన్నాథ్ ఆమెను పక్కకు పంపించాడు.

దీన్ని బట్టి చూస్తే నిధి అగర్వాల్ సినీ పరిశ్రమలో ఇంకా పూర్తిగా అర్థం చేసుకునేలా కనిపించలేదు. కానీ అప్పుడప్పుడు మాత్రమే ఫోటో షూట్లలో కనిపిస్తూ ఉంటుంది. అందాలను ఆరబోసేందుకు మాత్రం వెనకడుగు వేయదు. ప్రస్తుతం ఒక ఫోటో ని ఇంస్టాగ్రామ్ లో షేర్ చేసింది. ఇక ఈ ఫోటో విషయానికి వస్తే స్లో దుస్తుల్లో తన అందాలను చూపిస్తూ కుర్రకారును రెచ్చగొట్టేలా ఉంది. ప్రస్తుతం ఈ ఫోటో వైరల్ గా మారింది. ఈమె పై హాట్ కామెంట్ లతో నెటిజన్లు రెచ్చిపోతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: