వామ్మో:కుర్ర హీరోయిన్ మోజులో పడ్డ చైతన్య.. నిజమెంత..!

Divya
నాగచైతన్య.. టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో నాగచైతన్య అనే పేరు వినగానే మనకు గుర్తుకొచ్చే ఇంకొకపేరు సమంత.. అంతలా వీరిద్దరి జోడి సినీ ఇండస్ట్రీలో బెస్ట్ కపుల్ గా శాశ్వతంగా  నిలిచిపోయింది. సినీ ఇండస్ట్రీలోనే కాదు ప్రేక్షకులలో కూడా నాగచైతన్య.. సమంత.. అంటే ఒక బెస్ట్ కపుల్ అని క్యూట్ జోడి అని పిలిచిన వాళ్ళు లేకపోలేదు. అంతలా వీరిద్దరూ తమ జోడీకి అంత  మంచి గుర్తింపు వచ్చేలా చేసుకోవడం గమనార్హం. ఇకపోతే ఇద్దరూ ప్రేమించి, పెళ్లి చేసుకున్న తర్వాత కూడా కారణాలు చెప్పకుండా విడిపోతున్నాం అని ప్రకటించి.. అందరికి షాక్ ఇచ్చారు. అయితే విడాకుల బంధంతో దూరం అయినప్పటికీ స్నేహితులుగా కలిసే ఉంటామని చెప్పడంతో అభిమానులు కొంతవరకు ఊపిరిపీల్చుకున్నారు.


ఈమాట అవాస్తవమని చెప్పాలి.. ఎందుకంటే నాగ చైతన్య పుట్టిన రోజున కూడా సమంత ఏ మాత్రం మెసేజ్ చేయక పోవడంతో వీరిద్దరి మధ్య ఎంత పెద్ద సమస్య వచ్చిందో మనం అర్థం చేసుకోవచ్చు. ఇక సమంత.. నాగచైతన్య పుట్టినరోజు నాడు విషెస్ చెప్పకుండా రానా పుట్టిన రోజు నాడు.. ఎంతో గొప్ప మంచి మనసున్న వ్యక్తి.. ఈ ప్రపంచంలోనే లేడు అని చెప్పడంతో అప్పుడు కూడా రకరకాల వార్తలు ఎదురయ్యాయి. కానీ ఎవరు ఎలాంటి కామెంట్లకు బలి కాకుండా తమ కెరియర్లో దూసుకుపోవడానికి అటు నాగచైతన్య..ఇటు  సమంత కూడా ఇద్దరూ సినీ కెరీర్లో దూసుకుపోవడం గమనార్హం.


ఇకపోతే నాగ చైతన్య.. సమంతను పూర్తిగా మరచిపోయి.. ఇంకొక అమ్మాయి ప్రేమలో పడ్డాడు అనే వార్తలు వినిపిస్తుండడంతో ఈ అమ్మాయి ఎవరు అని ఆయన అభిమానులు..సమంత అభిమానులు కూడా ఆరా తీయడం గమనార్హం.. అంతేకాదు కుర్రహీరోయిన్ ప్రేమలో పడి సమంతను శాశ్వతంగా మరచి పోతాడు అంటూ కూడా వారి అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.. ఇక ఆ అమ్మాయి ఎవరో కాదు ఉప్పెన ఫేమ్ కృతి శెట్టి.. బంగార్రాజు సినిమాలో వీరిద్దరూ కలిసి నటిస్తున్న విషయం మనకు తెలిసిందే.. షూటింగ్ సెట్లో నాగ చైతన్య కృతి శెట్టి  తో చాలా క్లోజ్ గా ఉన్నట్లు.. కృతి శెట్టి కూడా నాగ చైతన్య తో చాలా క్లోజ్ గా మూవ్ అవుతున్నట్లు వార్తలు వినిపిస్తుండటంతో వీరిద్దరి మధ్య ఖచ్చితంగా ఎఫైర్ ఉందని సినీ ఇండస్ట్రీలో తారలు చెవులు కొరుక్కుంటున్నారు. మరి ఇది ఎంతవరకు వెళ్తుందో మనం తెలుసుకోవాలంటే ఇంకొన్ని రోజులు ఎదురుచూడక తప్పదు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: