ఆర్ ఆర్ ఆర్ : టికెట్స్ ధరలు ఇవే..
కరోనా వైరస్ మహమ్మారి వల్ల గత రెండు సంవత్సరాలుగా ఎగ్జిబిటర్లే ఎక్కువగా నష్టపోయారని ఏషియన్ సునీల్ చెప్పుకొచ్చారు.ఇక మేము ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొన్నామని మా కష్టాలను అర్థం చేసుకొని తెలంగాణ ప్రభుత్వం ముందుకు రావడం ఆనందించదగిన విషయమని ఏషియన్ సునీల్ వెల్లడించారు. ప్రభుత్వం ఇచ్చిన అవకాశాన్ని కొంతమంది దుర్వినియోగం చేస్తున్నారని తమకు తెలిసిందని ఫిల్మ్ ఛాంబర్ ప్రతినిధులు వెల్లడించడం జరిగింది. ఇక టికెట్ ధరలను పెంచిన వాళ్లు రేపటినుంచి తగ్గిస్తారని ఏషియన్ సునీల్ పేర్కొనడం జరిగింది. ఇక ఆర్ఆర్ఆర్ మూవీకి మల్టీప్లెక్స్‌లో టికెట్ ధర 295 రూపాయలుగా ఉంటుందని సింగిల్ స్క్రీన్ లో టికెట్ ధర 175 రూపాయలుగా ఉందని ఆయన చెప్పారు.ఇక థియేటర్లు తప్పనిసరిగా నిబంధనలు పాటించాలని ఇప్పటికే సూచనలు చేశామని ఏషియన్ సునీల్ తెలిపారు. ఇక నిబంధనలు పాటించని థియేటర్లను సీల్ చేస్తామని ప్రభుత్వం ప్రకటించిందని ఏషియన్ సునీల్ అన్నారు. ఇక భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ ఆర్ఆర్ఆర్ మూవీ అంచనాలకు మించి విజయాన్ని అందుకుంటుందో లేదో చూడాల్సి ఉంది.