రాధే శ్యామ్ లో ప్రభాస్ యాక్టింగ్ వేరే లెవలట..
గతంలో మాస్ సినిమాలు ఎక్కువగా చేసిన యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం రూటు మార్చారు. అన్ని భాషల ప్రేక్షకులను ఆకట్టుకునే సినిమాలలో నటించడానికి ప్రభాస్ చాలా ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నారు. ఇక ఈ సినిమాకు సంబంధించిన ప్రమోషన్ల విషయంలో కూడా వేగం పెరిగింది. ఈ సినిమా ట్రైలర్ కు తెలుగులో కూడా రికార్డు స్థాయిలో వ్యూస్ వచ్చాయి.వ్యూస్ పరంగా రాధేశ్యామ్ సినిమా ట్రైలర్ పాత రికార్డులను తుడిచేసి సరికొత్త రికార్డులను క్రియేట్ చేసింది. ఈ సినిమాలో ఒక సీన్ లో హీరోయిన్ చనిపోతారని ఆ సీన్ లో ప్రభాస్ పర్ఫామెన్స్ సినిమాకు హైలెట్ గా నిలిచేలా ఉంటుందని సమాచారం తెలుస్తుంది. రాధేశ్యామ్ ఫైనల్ కట్ ను చూసిన ప్రభాస్ చాలా సంతోషంగా ఫీలయ్యారని సమాచారం. బాహుబలి2 తర్వాత ఆ స్థాయి హిట్ రాధేశ్యామ్ తో సాధిస్తానని ప్రభాస్ చాలా నమ్మకంతో ఉన్నారు.ఇక ప్రభాస్ కు జోడీగా ఈ సినిమాలో పూజా హెగ్డే నటించగా ప్రభాస్ ఇంకా అలాగే పూజా హెగ్డే కాంబోలో వచ్చిన మొదటి మూవీ రాధేశ్యామ్ కావడం గమనార్హం.