సమంత కోసం కొరియోగ్రాఫర్ ని ఇబ్బంది పెట్టిన బన్నీ కారణం..!!

Divya
సమంత తొలిసారి ఐటమ్ సాంగ్ లో నటించిన సినిమా పుష్ప.. ఇక ఈ సినిమా తెరకెక్కిన విషయం తెలిసిందే.. ఇందులో అల్లు అర్జున్ హీరోగా నటించి మంచి విజయాన్ని అందుకున్నారు. టాలెంటెడ్ డైరెక్టర్ గా గుర్తింపు పొందిన సుకుమార్ ఈ సినిమాను తెరకెక్కించిన విషయం తెలిసిందే.. డిసెంబర్ 17 వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా విడుదలైన పుష్పా సినిమా అన్ని చోట్ల కూడా మంచి విజయాన్ని సొంతం చేసుకోవడం గమనార్హం. ఇక ఈ సినిమాతో తనలో ఉన్న ప్రతిభను మరోసారి ప్రేక్షకులకు చూపించాడు బన్నీ..
ఇక పోతే ఎన్నో అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా కోసం బన్నీ అభిమానులు సుమారుగా రెండు సంవత్సరాల పాటు ఎదురు చూశారు.. దేవీ శ్రీ ప్రసాద్ స్వరపరిచిన ఈ సినిమాలో పాటలు మంచి ప్రేక్షకాదరణ పొందడమే కాకుండా ఇందులో సమంత చేసిన ఐటమ్ సాంగ్ కు విశేష స్పందన లభించడం విశేషం. ఊ అంటావా అనే ఈ పాటను చంద్రబోస్ రాసినా.. దేవిశ్రీప్రసాద్ స్వరపరిచినా.. కొరియోగ్రాఫర్ గా ఈ పాటను కంపోజ్ చేసిన మాస్టర్ విజయ్ కి మంచి గుర్తింపు లభించిందని చెప్పవచ్చు.. తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న విజయ్ ఈ పాట గురించి తెలిపాడు..
అల్లు అర్జున్ నన్ను పిలిచి నాకు అవకాశం ఇస్తాడు అని నేను ఎప్పుడూ కూడా అనుకోలేదు.. కానీ మొదటిసారి పుష్ప సినిమా ద్వారా నా కల నెరవేరింది.. ఇక ఈ సినిమా విజయం తర్వాత నేను పొందిన ఆనందం మాటల్లో చెప్పలేనిది.. ఈ సినిమాను నేను మొదటిసారి థియేటర్లో చూసినప్పుడు.. నా పాట వస్తున్నప్పుడు కుర్రాళ్ళంతా షర్ట్ విప్పేసి డాన్స్ చేశారు.. ఇక వారి సంబరాలను చూసి నాకు కన్నీళ్ళు వచ్చాయి.. అనుకోకుండా ఆఫర్ వచ్చింది. ఇక నేను చేసిన డాన్స్ వీడియోలు కొంతమంది కోడైరెక్టర్ లకు కూడా పంపించగా వాటిలో బన్నీ నా వీడియో చూసి నన్ను పిలిపించి మరి ఈ పాటకు కంపోజ్ చేయించాడు.
మొదట రెండు రోజుల పాటు నాకు ఎలాంటి ఫోన్ కాల్ రాకపోవడంతో చాలా భయపడ్డాను..కానీ కాల్ వచ్చింది.. వెళ్ళగానే నన్ను చూసి అల్లు అర్జున్ చంపేసావు.. చాలా బాగా చేశారు.. మీ టేకింగ్ సూపర్ ఇలాగే కంటిన్యూ చేయండి  అంటూ నా భుజం తట్టారు.. సమంత గారితో ఈ పాటకు కంపోజ్ చేయడానికి అల్లు అర్జున్ సార్ కూడా బాగా రిక్వెస్ట్ చేశారు.. ఇది నాకు చాలా హ్యాపీగా అనిపించింది అంటూ తెలిపాడు విజయ్.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: