RRR: వాయిదా పై ఫ్యాన్స్ విపరీతమైన ట్రోల్స్..!
ఆర్.ఆర్.ఆర్ వాయిదా వేయడం చిత్రయూనిట్ కి కూడా ఇష్టం లేదు. కాని దేసంలో ఒమిక్రాన్ తీవ్రత అధికంగా ఉండటం వల్ల సినిమా వాయిదా వేసుకోవాల్సి వచ్చింది. ఈసారి వాయిదాతో ఆర్.ఆర్.ఆర్ నాలుగు సార్లు రిలీజ్ పోస్ట్ పోన్ చేసుకుంది. సినిమా ట్రైలర్ అంచనాలు పెంచగా సినిమా ఎప్పుడెప్పుడు చూదామా అన్న ఎక్సయిట్మెంట్ ఫ్యాన్స్ లో ఉంది. అయితే సినిమా అనుకున్న టైం కు రాకుండా మరింత లేట్ అవుతుంది.
సంక్రాంతికి మిస్ అవుతున్న ఈ సినిమా సమ్మర్ లో రిలీజ్ చేసే అవకాశాలు ఉన్నాయి. ఫ్యాన్స్ ఎంత ట్రోల్ చేస్తున్నా వారి బాధని చిత్రయూనిట్ అర్ధం చేసుకుంటుంద్ది. సినిమా రిలీజ్ కేవలం ఆరు రోజులే ఉందనగా సినిమా వాయిదా వేయడం షాకింగ్ గా ఉంది. డివివి దానయ్య నిర్మించిన ఆర్.ఆర్.ఆర్ సినిమాలో ఎన్.టి.ఆర్, రాం చరణ్ నటించగా అజయ్ దేవగన్, అలియా భట్ కూడా ఇంపార్టెంట్ రోల్ లో నటించారు. సినిమా వరల్డ్ వైడ్ గా గ్రాండ్ రిలీజ్ ప్లాన్ చేశారు. నార్త్ సైడ్ కరోనా కొత్త వేరియంట్ ప్రభావం ఎక్కువగా ఉంది. యూఎస్ లో కూడా కేసులు పెరగడం వల్ల సినిమాపై అక్కడ భారీ ఎఫెక్ట్ పాడేలా ఉంది. అందుకే గత్యంతరం లేక సినిమా రిలీజ్ ఆపేశారు చిత్రయూనిట్. మళ్లీ నెక్స్ట్ రిలీజ్ ఎప్పుడు అన్నది ప్రకటించాల్సి ఉంది.