నాచురల్ స్టార్ హీరో నానికి ఈ ఏడాది అదృష్టం పట్టుకుందిగా..!!

Divya
పోయిన ఏడాది చాలా మంది హీరోలు హీరోయిన్లు కూడా పెద్దగా కలిసి రాక ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్న విషయం తెలిసిందే ఈ సంవత్సరం మొదట్లో మంచి గా జరగాలని అని ఎంతో మంది హీరోలు అనుకుని న్యూ ఇయర్ లో అడుగు పెట్టారు. అయితే ప్రస్తుతం సక్సెస్ రేటు తక్కువ ఉండి.. వరుస ఫ్లాప్ లను చవిచూసిన హీరో నాని గురించి మనం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.. తాజాగా శ్యామ్ సింగరాయ్ సినిమాతో కాస్త ఊపిరి పీల్చుకున్నాడు అని చెప్పవచ్చు. ఇక కలెక్షన్ల పరంగా కూడా బాగానే రాణించిన ట్లు గా తెలుస్తోంది. ఈ సినిమా ప్రమోషన్ లో భాగంగా నాని కొన్ని విషయాలను పంచుకున్నారట.. ఇప్పుడు వాటి గురించి మనం చూద్దాం.

హైదరాబాదు నుంచి కేవలం ఒక గంట ప్రయాణం చేస్తే చాలు తన పొలం వస్తుందని తెలియజేశారు. తనకి పచ్చదనం అన్న, ప్రకృతి అన్న చాలా ఇష్టం అని తెలియజేశారు. అందుచేతనే పొలాన్ని, అక్కడున్న స్థలాన్ని కొన్నానని తెలియజేశారు నాని.. తనకి సినిమా షూటింగ్ లేనపుడల్లా  అక్కడికి వెళ్లి వస్తాను అని తెలియజేశారు. అప్పుడప్పుడు తమ ఫ్యామిలీ, కుటుంబ సభ్యులతో కూడా వెళ్తానని తెలియజేశారు. అక్కడ ఉండే ప్లేస్ కి వెళితే తనకి చాలా ఆనందంగా ఉంటుందని చెప్పుకొచ్చారు.
కరొనా సమయంలో అందరూ చాలా ఇబ్బంది పడుతుంటే.. నేను మాత్రం పొలం దగ్గర బాగా ఎంజాయ్ చేశాం అని తెలియజేశారు. శ్యామ్ సింగరాయ్ సినిమా 35 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్లను కొల్లగొట్టిందని  తెలియజేశారు. ఇక ఈ సినిమా విడుదలైన కొద్ది రోజుల తర్వాత ఈ మూవీ ఓటిటీలో విడుదల అవుతుందని చెప్పుకొచ్చారు.అది కూడా నెట్ ఫ్లిక్స్ కు భారీ ధరకే అమ్ముడు పోయింది అని తెలియజేశారు. ఏది ఏమైనా దానికి ఈ ఏడాది బాగానే కలిసొచ్చింది చెప్పవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: