షాక్:చిక్కితే వాడి దవడ పగలగొడుతా అంటున్న బాలయ్య..!!

Divya
బాలకృష్ణ.. తెలుగు సినీ ఇండస్ట్రీలో ఉండే హీరోలందరికీ కొంచెం వ్యతిరేకమని చెప్పవచ్చు. ఎందుకంటే ఆయన ఏ విషయాన్ని కూడా తన మనస్సులో దాచుకోకుండా అటు ప్రేమనైనా.. ఇటు కోపాన్ని అయినా వెంటనే చూపిస్తూ ఉంటాడు. ఇక అభిమానుల విషయానికి వస్తే వారిపై ఏకంగా చేయి చేసుకోవడానికి కూడా వెనుకాడడు బాలయ్య. అందుకే బాలకృష్ణ తో కొంతమంది చనువుగా ఉంటే మరికొంతమంది కొద్దిగా దూరంగానే ఉంటారు అని అందరూ అంటుంటారు. కానీ సినిమా షూటింగ్ సెట్లో ఆయనతో ఎవరైనా సరే కలిసి పనిచేస్తే తప్పకుండా ఆయన ఒక మంచి గొప్ప మనసున్న వ్యక్తి అని చెబుతూ ఉండటం మనకు తెలిసిన విషయమే. ఇటు సినిమాలలో అటు రాజకీయాల్లో తనదైన మార్క్ వేసుకున్నారు..

ఒకానొక దశలో వరుస ప్లాపులతో కొట్టుమిట్టాడిన బాలయ్య ఆ తరువాత దర్శకులు, నిర్మాతల , కథల ఎంపికలో జాగ్రత్త వహిస్తూ.. ప్రస్తుతం అన్ని సినిమాలతో మంచి విజయాన్ని అందుకుంటున్నాడు. అంతేకాదు ఆహా ఓటీటీలో ప్రసారమవుతున్న అన్ స్టాపబుల్  షో కి హోస్ట్ గా వ్యవహరించి ఈ షోకి ప్లస్ పాయింట్ గా నిలుస్తున్నాడు. కాకపోతే ఎంతో మంది సెలబ్రిటీలను ఈ షోకి ఆహ్వానించి వారి వ్యక్తిగత విషయాలను కూడా తెలుసుకొంటూ మంచి టిఆర్పి రేటింగ్ ను కూడా అందిస్తున్నాడు. అంతేకాదు ఇతర రియాల్టీ షోల కంటే ఈ షోకి టిఆర్పి రేటింగ్ తో దూసుకుపోవడం గమనార్హం.


ఇకపోతే బుల్లితెరకు ఎప్పుడూ దూరంగా ఉండే బాలయ్య బాబు మొదటిసారి హోస్టింగ్ చేయడంతో.. ఆయన హోస్టింగ్ కి అభిమానులంతా ఫిదా అవుతున్నారు. ఇకపోతే డిసెంబర్ 31 వ తేదీన ప్రసారం అయిన ఈ షో కి గోపీచంద్ మలినేని తో పాటు మాస్ మహారాజా రవితేజ కూడా హాజరయ్యారు. ప్రస్తుతం ఈ  ఎపిసోడ్ ఆహా ఓ టీ టీ లో స్ట్రీమ్ అవుతోంది. ఇకపోతే కొంతమంది న్యూస్ ఛానల్ వాళ్ళు వ్యూస్ ఎక్కువగా రావడం కోసం బాలయ్య కొంత మంది హీరోలతో గొడవ పడ్డాడు అన్నట్లుగా తప్పుడు వార్తలు రాసుకొస్తున్నారు. ఇకపోతే ఈ షో లో .. ఎవరూ కావాలని పేరు , అడ్రస్ లేని వాళ్ళు రవితేజ నేను గొడవ పడ్డాము అని.. మా హీరో తోపు నీ హీరో సోపు అంటూ రకరకాలుగా మాట్లాడుతున్నారు.

ప్రస్తుతం సర్జరీ చేయించుకున్న ఎడమ చెయ్య కూడా సిద్ధంగా ఉంది.. దొరికితే ఆనా కొడుకుల దవడ పగలగొడతాను అంటూ చాలా ఘాటుగా తనదైన శైలిలో స్పందించారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: