మాస్ మహారాజా
రవితేజ వరుస సినిమాలతో అంతకంతకు స్పీడ్ పెంచేస్తున్న సంగతి తెలిసిందే.
క్రాక్ సినిమాతో కంబ్యాక్ అయిన
మాస్ రాజా ఎక్కడా తగ్గడం లేదు.సీసీ పవర్ ఇంకా హార్స్ పవర్ పెంచేస్తున్నాడే కానీ ఎక్కడా లో ప్రొఫైల్ అన్న మాటే లేదు. ప్రస్తుతం
రవితేజ నటించిన ఖిలాడీ రిలీజ్ కి రెడీ అవుతోంది. మరోవైపు రామారావు ఆన్ డ్యూటీ
సినిమా చిత్రీకరణ సాగుతోంది. ధమాకా.. స్టూవర్డ్ పురం అంటూ
రవి తేజ ఒకటే అగ్గి రాజేస్తున్నాడు.ఇక ఈ నాలుగు సినిమాలు కూడా క్యూలో ఉండగానే ఇప్పుడు ఐదో సినిమాని కూడా ప్రకటించేశాడు
మాస్ మహారాజా.ఈ సినిమాకి రావణాసుర అనేది టైటిల్. హీరోస్ నాట్ ఎగ్జిస్ట్ అంటూ సూపర్ క్యాప్షన్ తో హీటెక్కించేస్తున్నాడు. ఈ సినిమాకి
సుధీర్ వర్మ దర్శకుడు.
అభిషేక్ పిక్చర్స్- ఆర్.టి ఎంటర్ టైన్ మెంట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాకి
అభిషేక్ నామా నిర్మాత. 14
జనవరి ఉదయం 9.50 గం.లకు
హైదరాబాద్ అన్న
పూర్ణ స్టూడియోస్ లో
పూజా కార్యక్రమాలతో లంఛనంగా ఈ చిత్రం ప్రారంభం కానుంది.ఇక ఆ మేరకు పోస్టర్లతో ప్రకటన వెలువడింది.
పదితలల రావణాసురుడిగా
రవితేజ లుక్ ని రివీల్ చేయగా అది మంచి క్యూరియాసిటీని పెంచుతోంది. ఇక ఇందులో మన
మాస్ రాజా
రవితేజ సూటు బూటు వేసిన రావణాసురుడు చేతిలో బలమైన సుత్తితో రక్తపు చారలతో కనిపించాడు. అంటే ఇది
మాస్ యాక్షన్ క్రైమ్
థ్రిల్లర్ అని స్పష్టంగా అర్థమవుతోంది.ఇక
కార్తికేయ సినిమా లాంటి
బ్లాక్ బస్టర్ ని తెరకెక్కించిన
సుధీర్ వర్మ మరో ప్రయోగాత్మక సినిమాతో ఆడియెన్స్ ని అలరించనున్నారు.ఇక ఈ సినిమాకి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలో వెల్లడి కావాల్సి ఉంది.ఇక ఖిలాడీ
సినిమా విషయానికి వస్తే ఈ
సినిమా చివరి పాట షూటింగ్ జరుగుతుంది. ఈ పాట తప్ప టాకీ పార్ట్ ఇంకా ప్యాచ్ వర్క్ కూడా పూర్తయింది. అలాగే మరోవైపు నిర్మాణనంతర పనులు కూడా జరుగుతున్నాయి. ఫ్యాన్స్ అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా ఈ
సినిమా ఉంటుందని
సినిమా దర్శకుడు రివీల్ చేసారు. ఇక అన్ని పనులు పూర్తిచేసి సినిమాని
ఫిబ్రవరి 11న విడుదల చేయడానికి రెడీ అవుతున్నారు. ఇక అదే నెలలో
మెగాస్టార్ చిరంజీవి నటించిన ఆచార్య
సినిమా కూడా విడుదల అవుతుంది.