రెజీనా కెరియర్ కి మెగాస్టార్ హెల్ప్..!

shami
ఒకప్పుడు హీరోయిన్ గా సత్తా చాటిన రెజినా స్టార్ హీరోయిన్ అవుతుందని అనుకోగా ఆమె ఓ మోస్తారు ఇమేజ్ తోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది. మెగా హీరోల సరసన నటించినా సరే అమ్మడికి లక్ కలిసి రాలేదు. ఇక కెరియర్ లో వచ్చిన ప్రతి అవకాశం చేసిన రెజినా వాటి ఫలితాల వల్ల వెనకపడ్డది. లేటెస్ట్ గా మెగాస్టార్ చిరంజీఎవి ఆచార్య సినిమాలో రెజినా ఐటం సాంగ్ తో సర్ ప్రైజ్ చేసింది. ఈమధ్య ఐటం సాంగ్స్ కు హీరోయిన్స్ పోటీ పడుతున్నారు. ఒకప్పుడు ఐటం సాంగ్స్ కోసం స్పెషల్ గా ముమైత్ ఖాన్ లాంటి వాళ్లని తీసుకునే వారు కానీ ఇప్పుడు అవి కూడా హీరోయిన్స్ తో చేయిస్తున్నారు.

ఈ క్రమంలో రెజినా ఆచర్య సినిమాలో సానా కష్టం సాంగ్ లో నర్తించింది. మెగాస్టార్ సరసన కాలు కదిపే ఛాన్స్ అంటే నిజంగానే లక్కీ అని చెప్పొచ్చు. ఒకప్పుడు హీరోయిన్ గా నటించిన రెజినా ఇప్పటికి సినిమాల్లో లీడ్ రోల్ చేస్తున్నా స్పెషల్ సాంగ్స్ కోసం రెడీ అంటుంది. ఓ విధంగా చెప్పాలంటే రెజినా కెరియర్ కు మెగాస్టార్ చిరంజీవితో చేసిన ఈ సాంగ్ చాలా హెల్ప్ అయ్యే అవకాశం ఉంది.

ఆచార్యలో సానా కష్టం సాంగ్ లో రెజినా మ్యాక్సిమం తన అందాలతో మత్తెక్కించే ప్రయత్నం చేసింది. స్పీషల్ సాంగ్ అంటేనే హాట్ గా కనిపించడం. ఇక మీదట ఎలాగైనా ఆడియెన్స్ ని మెప్పించాలనే ప్రయత్నంలో రెజినా అదరగొట్టేస్తుంది. ఓ విధంగా చెప్పాలంటే రెజినాకి ఇది చాలా గొప్ప అవకాశం అని చెప్పొచ్చు. ప్రస్తుతం తమిళ సినిమాలతో పాటుగా శాకిని డాకిని అనే సినిమా చేస్తున్న రెజినాకి 2022 కలిసి వస్తుందేమో చూడాలి. ఆచార్య సినిమాలో పూజా హెగ్దే, కాజల్ అగర్వాల్ హీరోయిన్స్ గా నటించగా మణిశర్మ మ్యూజిక్ అందిస్తున్నారు.




మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: